Game Changer: అబ్బా.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ రిలీజ్పై స్పందించిన రామ్ చరణ్

Game Changer: అబ్బా.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ రిలీజ్పై స్పందించిన రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్(RRR) లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రామ్ చరణ్(Ram Charan) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అందుకే ఆయన సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే నెక్స్ట్ సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్. ఇందులో భాగంగానే ఆయన నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

అయినప్పటికి ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా కాస్త డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అయితే.. తాజాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై స్పందించారు హీరో రామ్ చరణ్. ఇటీవల ఆయనకు వేల్స్ యువర్సిటీ డాక్టరేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం ఆయన శనివారం చెన్నైకి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నా నెక్స్ట్ సినిమా గేమ్ ఛేంజర్. కెరీర్ లో ఫస్ట్ టైం ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరి వారంలో థియేటర్స్ లోకి వస్తుంది. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్  చూస్తున్నాం.. అంటూ చెప్పుకొచ్చారు. 

దీంతో మరో ఐదు నెలల్లో గేమ్ ఛేంజర్ థియేటర్స్ లోకి రానుందని తెలిసి హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ అప్డేట్ వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.