‘‘వంట చేయడం చిటికెలో పని’’ అంటుంటారు కొందరు. కానీ.. వంట అంత ఈజీ ఏం కాదు. కొందరికైతే ఇది ప్రతి రోజూ ఉండే పెద్ద టాస్క్. అందుకే ఈ కష్టమైన పనిని కాస్త సులభంగా చేసుకోవడానికి సాయపడే ఎన్నో గాడ్జెట్స్, టూల్స్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. వాటిలో తక్కువ ధరకు దొరికే.. ఎక్కువ సాయం చేసేవి ఇవి. ఇక్కడ ఇచ్చిన అన్నింటి ధర వెయ్యి రూపాయల్లోపే ఉంటుంది. మీ అవసరాలకు సరిపోతాయనుకుంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి ట్రై చేయొచ్చు. అన్నీ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
కట్ రెసిస్టెంట్ గ్లోవ్స్
వంట చేయడం ఎంత అలవాటున్నా చాలామందికి చేతులు కాల్చుకోవడం, కోసుకోవడం మామూలే. కొందరైతే ఏదో ఆలోచిస్తూ కూరగాయలు కోస్తుంటారు. వాటితోపాటు వేలు కూడా కోసుకుంటారు. అలాంటివాళ్లకు ఈ గ్లోవ్స్ బెస్ట్ చాయిస్. వీటికి నైఫ్ కట్ రెసిస్టెంట్ ఉంటుంది. నైలాన్‌తో తయారు చేస్తారు. కత్తి వేలిమీద పడినా.. కట్ అవ్వదు. ధర: 237 రూపాయల నుంచి మొదలు
గార్లిక్ ప్రెస్ రాకర్
కొందరు వెల్లుల్లిని ఎప్పటికప్పుడు నూరి, కూరల్లో వేసుకుంటారు. అలా ఫ్రెష్ గార్లిక్ పేస్ట్ వేస్తే వంట రుచి కూడా బాగుంటుంది. కానీ.. వంట చేసిన ప్రతిసారి రోటిలో దంచాలంటే కష్టమే. అలాఅని ఆ నాలుగైదు రెబ్బలను మిక్సీలో కూడా వేయలేం. అలాంటప్పుడు ఈ గార్లిక్ ప్రెస్ రాకర్ వాడితే సరిపోతుంది. కటింగ్ బోర్డ్‌పై వెల్లుల్లి రెబ్బలని పెట్టి, దీంతో కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. పేస్ట్‌లా కావాలనుకుంటే నాలుగైదు సార్లు, చిన్న ముక్కల్లా కావాలంటే ఒకసారి ప్రెస్ చేయాలి. ధర: 200 రూపాయల నుంచి మొదలు
కంటైనర్ కటింగ్ బోర్డ్
కొన్ని రకాల కూరల్లోకి రెండు మూడు రకాల కూరగాయలతో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేస్తుంటారు. అలాంటప్పుడు కటింగ్ బోర్డ్ మీద కట్‌చేసి ఒక్కోదాన్ని ఒక్కో ప్లేట్‌లో వేయాలి. పైగా కొన్ని ముక్కలు కట్ చేయగానే కటింగ్ బోర్డ్ నిండిపోతుంది. కాబట్టి వెంట వెంటనే గిన్నెలో వేయాలి. లేదంటే కట్ చేయడానికి బోర్డ్ మీద స్థలం సరిపోదు. దీని వల్ల టైం వృథా అవడంతోపాటు పని కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కంటైనర్ కటింగ్ బోర్డ్‌ని వాడితే సరిపోతుంది. వీటిలో నాలుగు కంటైనర్స్ ఉంటాయి. కట్ చేసిన కూరగాయలను వెంటనే కంటైనర్‌లోకి తోసేయొచ్చు. ఒక్కో రకం వెజిటబుల్ ఒక్కో కంటైనర్‌లో వేస్తే సరిపోతుంది. వంట చేసేటప్పుడు కంటైనర్‌ని బోర్డ్ నుంచి తీసుకుంటే సరిపోతుంది.
ధర: 999 రూపాయల నుంచి మొదలు
గార్లిక్ ప్రెస్ రాకర్
కొందరు వెల్లుల్లిని ఎప్పటికప్పుడు నూరి, కూరల్లో వేసుకుంటారు. అలా ఫ్రెష్ గార్లిక్ పేస్ట్ వేస్తే వంట రుచి కూడా బాగుంటుంది. కానీ.. వంట చేసిన ప్రతిసారి రోటిలో దంచాలంటే కష్టమే. అలాఅని ఆ నాలుగైదు రెబ్బలను మిక్సీలో కూడా వేయలేం. అలాంటప్పుడు ఈ గార్లిక్ ప్రెస్ రాకర్ వాడితే సరిపోతుంది. కటింగ్ బోర్డ్‌పై వెల్లుల్లి రెబ్బలని పెట్టి, దీంతో కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. పేస్ట్‌లా కావాలనుకుంటే నాలుగైదు సార్లు, చిన్న ముక్కల్లా కావాలంటే ఒకసారి ప్రెస్ చేయాలి. ధర: 200 రూపాయల నుంచి మొదలు
ఆయిల్ స్ప్రేయర్
కొన్ని రకాల వంటకాలు వండేటప్పుడు నూనెను స్ప్రే చేయాలి. ముఖ్యంగా ఎగ్ ఆమ్లెట్ వేసేముందు పెనంపై, ఒవెన్‌లో కుక్ చేసేముందు వంటకాలపై ఆయిల్‌ని స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొందరు సిలికాన్ బ్రష్‌తో స్ర్పెడ్ చేస్తారు. దాంతో వేయాల్సిన దానికంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది. అలాంటప్పుడు ఈ ఆయిల్ స్ర్పేయర్‌తో స్ప్రే చేస్తే సరిపోతుంది. బిర్యానీలాంటి వంటకాలపై నెయ్యి స్ప్రే చేయడానికి కూడా దీన్ని ఈజీగా వాడొచ్చు.
ధర: 250 రూపాయలు నుంచి మొదలు