
నస్పూర్, వెలుగు : 2025--–26 ఆర్థిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జీఎం ఆఫీసులో మీడియాతోమాట్లాడుతూ.. ఆగస్టు నెలలో ఆర్. కె 5గని 96 శాతం, ఆర్.కె 7 గని 104 శాతం, ఆర్.కె న్యూటెక్ గని 114, ఎస్సార్పీ 1 గని 100, ఎస్సార్పీ 3,3ఏ గని 68, ఐకే1ఏ గని 80 ఉత్పత్తితో భూగర్భ గనులు 88 శాతం ఉత్పత్తి సాధించాయన్నారు.
ఎస్సార్పీ ఓసీపీ 65 శాతం, ఐకే ఓసీపీ 127 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 84 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, డీజీఎం (ఐఈడీ) రాజన్న, సీనియర్ పీఓ.పీ కాంతా రావు తదితరులు పాల్గొన్నారు.