Gmail లో కొత్త ఫీచర్..సబ్ స్క్రిప్షన్ల నిర్వహణకు వన్-క్లిక్ అన్‌సబ్‌స్క్రైబ్ బటన్

Gmail లో కొత్త ఫీచర్..సబ్ స్క్రిప్షన్ల నిర్వహణకు వన్-క్లిక్ అన్‌సబ్‌స్క్రైబ్ బటన్

Gmailలో అవాంఛిత ఇమెయిల్స్ కు చెక్ పెట్టేందుకు  Google ఇటీవల కొత్త  Manage subscriptions ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది యూజర్లు తమ ఇమెయిల్ సబ్‌స్క్రిప్షన్‌లన్నింటినీ ఒకే చోట చేసేందుకు సహాయపడుతుంది. దీంతో ప్రతి మేసేజ్ ను తెరవకుండానే కేవలం ఒక క్లిక్‌తో అవాంఛిత ఇమెయిల్‌ల నుంచి అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ సాధనం మీ ఇన్‌బాక్స్‌ను క్లియర్ చేసేందుకు సాయపడుతుంది. 

ఈ ఫీచర్ మీ ఇన్‌బాక్స్‌లోని అన్ని యాక్టివ్ ఇమెయిల్ సబ్‌స్క్రిప్షన్లను ఒకే చోట చూపిస్తుంది. మీరు గత కొన్ని వారాల్లో కంపెనీగానీ, వ్యక్తులులనుంచి ఎన్ని ఇమెయిల్‌లు అందుకున్నారో కూడా ఇది చూపిస్తుంది.

మేసేజ్ లు అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే వారి పేరు పక్కన ఉన్న Unsubscribe బటన్‌ను క్లిక్ చేయవచ్చు. మీ తరపున మేసేజ్ పంపినవారికి Gmail అన్‌సబ్‌స్క్రైబ్ అభ్యర్థనను పంపుతుంది. దీని కోసం బయటి వెబ్‌సైట్‌లను సందర్శించాల్సిన అవసరం లేదు.

యాక్సెస్ చేయడం ఎలా.. 

మీ కంప్యూటర్‌లో Gmail తెరిచి ఎడమవైపున Moreపై క్లిక్ చేసి ఆపై Manage subscriptions సెలెక్ట్ చేసుకోవాలి. Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో అయితే Gmail యాప్‌ను తెరిచి ఎడమవైపు పైన ఉన్న మెనూ నొక్కి ఆపై  Manage subscriptions సెలెక్ట్ చేసుకోవాలి. 

►ALSO READ | Anil Ambani: అనిల్ అంబానీకి మరో శుభవార్త.. వెనక్కి తగ్గిన కెనరా బ్యాంక్!

మీరు మేసేజ్ పంపిన వారిని అన్‌సబ్‌స్క్రైబ్ చేసినప్పుడు కొత్త ఇమెయిల్‌లు మీ స్పామ్ ఫోల్డర్‌కు వెళ్తాయి. కొన్నిసార్లు అన్‌సబ్‌స్క్రైబ్ చేయడానికి పంపినవారు మిమ్మల్ని వారి వెబ్‌సైట్‌కు సందర్శించాలని కోరవచ్చు. ఈ సందర్భంలో పాప్-అప్ విండోలో  Go to website ఎంపిక కనిపిస్తుంది. 

ఈ ఫీచర్ Google Workspace కస్టమర్‌లు, Workspace Individual సబ్‌స్క్రైబర్లు, వ్యక్తిగత Gmail కస్టమర్లకు అందుబాటులో ఉంది.

ఇది ప్రస్తుతం దశలవారీగా విడుదల అందుబాటులోకి వస్తుంది. కాబట్టి అందరికి అందుబాటులోకి రావాలంటే కొంత సమయం పట్టవచ్చు. ఈ కొత్త ఫీచర్ మీ ఇన్‌బాక్స్‌ను క్లియర్ చేయడంతో పాటు అవసరం లేని ఇమెయిల్‌లను సులభంగా తొలగించేందుకు సాయపడుతుంది.