
జీఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ,తమ విమాన శిక్షణ సంస్థలోని పూర్తి వాటాను థర్డ్ పార్టీ కీ విక్రయించింది. ఎంతకు విక్రయించిందనే విషయం కంపెనీ వెల్లడించలేదు.జీహెచ్ఐఏఎల్ అనుబంధ సంస్థ అయిన షియా పసిఫిక్ ఫ్లైట్ ట్రెయినింగ్ అకాడమీ లిమిటెడ్ (ఏపీఎఫ్ టీఏఎల్) లోని తమ100 శాతం వాటాను థర్డ్ పార్టీ కి అమ్ముతున్నట్లు జీఎమ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. విమాన శిక్షణలో సేవలందిస్తున్న ఏపీఎఫ్ టీఏఎల్ 2018 డిసెంబర్ 31 తో ముగిసి న 9 నెలల కాలానికి రూ.4.72 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.వాటా ఉపసంహరణతో ఇక మీదట జీహెచ్ఐఏఎల్, జీఐఎల్ లకు అనుబంధ సంస్థగా ఏపీఎఫ్ టీఏఎల్ ఉండదు.