గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదల

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదల

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. జీవో 46 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనున్నట్లు రేవంత్ సర్కార్ జీవోలో స్పష్టం చేసింది. సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య సర్వే( SEEPC 2024 జనాభా డేటా) ఆధారంగా రిజర్వేషన్ కేటాయింపు ఉంటుందని తెలిపింది.

సర్పంచ్ రిజర్వేషన్‌కు 2011 జనగణనతో పాటు SEEPC డేటా వినియోగించుకుంటామని పేర్కొంది. 100 శాతం ఉన్న ST గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు STలకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 'Descending Population Order' ప్రకారం కేటాయించనున్నట్లు తెలిపింది. మునుపటి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయకూడదని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చని జీవోలో ప్రభుత్వం తెలిపింది.

* MPDO ఆధ్వర్యంలో వార్డు రిజర్వేషన్ల నిర్ణయం.. RDO ఆధ్వర్యంలో సర్పంచ్ రిజర్వేషన్ల నిర్ణయం
* ST రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి, తరువాత SC, BCలకు కేటాయింపు
* మహిళల రిజర్వేషన్ అన్ని కేటగిరీలలో ప్రత్యేకంగా లెక్కించి అమలు
* గ్రామ పంచాయతీ/వార్డుల సంఖ్య తక్కువైతే మొదట మహిళలకు.. తరువాత Lottery పద్ధతి 
* అమలుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్షన్ అథారిటీలకు ఆదేశాలు