టీజీపీఎస్సీని సందర్శించిన గోవా పీఎస్సీ చైర్మన్..పరీక్షల నిర్వహణ.. సంస్కరణలపై చర్చ  

టీజీపీఎస్సీని సందర్శించిన గోవా పీఎస్సీ చైర్మన్..పరీక్షల నిర్వహణ.. సంస్కరణలపై చర్చ  

హైదరాబాద్, వెలుగు: గోవా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్‌‌‌‌సింహ్ శ్రీకాంత్ రావురాణే బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని సందర్శించారు. కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలు, కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణ, పరీక్షల సమర్థ పర్యవేక్షణ వంటి అంశాలపై ఇరువురు చర్చించారు.

రిక్రూట్‌‌‌‌మెంట్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు, అభ్యర్థుల్లో విశ్వాసం పెంచేందుకు ఇటీవల టీజీపీఎస్సీ చేపట్టిన నూతన సంస్కరణలు, అమలు చేస్తున్న ఆధునిక విధానాల గురించి గోవా పీఎస్సీ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణలో వస్తున్న ఆధునిక మార్పులు, నియామకాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుపై ఇరు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తమ సంస్థాగత అనుభవాలను, ఆలోచనలను పరస్పరం పంచుకున్నాయి. పారదర్శకత కోసం సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.