ఇండియా రెజ్లర్‌‌ నీలమ్‌‌ కు సిల్వర్‌‌ మెడల్‌‌

ఇండియా రెజ్లర్‌‌ నీలమ్‌‌ కు సిల్వర్‌‌ మెడల్‌‌

అస్తానా: ఇండియా రెజ్లర్‌‌ నీలమ్‌‌ సిరోహి.. వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో సిల్వర్‌‌ మెడల్‌‌తో మెరిసింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌ 50 కేజీల ఫైనల్లో నీలమ్‌‌.. టోక్యో ఒలింపిక్స్‌‌ స్వర్ణ విజేత యూయ్‌‌ సుసాకి (జపాన్‌‌) చేతిలో ఓడి రెండో ప్లేస్‌‌తో సరిపెట్టుకుంది. దాంతో సీనియర్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో రజతం సాధించిన రెండో విమెన్‌‌ రెజ్లర్‌‌గా 26 ఏళ్ల నీలమ్‌‌ రికార్డులకెక్కింది. 

అంతకుముందు 2021లో అన్షు మాలిక్‌‌ (57 కేజీ) సిల్వర్‌‌ మెడల్‌‌ గెలిచింది. 79 కేజీ సెమీస్‌‌లో కాజల్​ ధోచక్.. అనాస్థాసియా అల్పెయియేవా (ఉక్రెయిన్​) చేతిలో ఓడి సిల్వర్​తో సరిపెట్టుకుంది.