
కోలీవుడ్ స్టార్ విజయ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం మూడో పాటను విడుదల చేశారు. ఈ పాటను యువన్ శంకర్ రాజా కంపోజ్ చేయడంతో పాటు వృష బాలుతో కలిసి ఎనర్జిటిక్ గా పాడాడు.
‘జిగి జింతాకు చూపే ఒక స్పార్కు.. ఆ నాజుకు నడకే క్యాట్ వాకు’ అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఇంప్రెస్ చేశాయి. విజయ్, మీనాక్షి జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, యోగి బాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.