'గాడ్ ఫాదర్' టైటిల్ సాంగ్ రిలీజ్

'గాడ్ ఫాదర్' టైటిల్ సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబరు 5న దసరా కానుకగా రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి తాజాగా టైటిల్ సాంగ్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాటకు తమన్ సంగీతం అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. 

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్‌, స‌త్యదేవ్‌, న‌య‌న‌తార కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన థార్ మార్ థ‌క్కర్ మార్, న‌జ‌భ‌జ జ‌జ‌ర పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. తాజాగా టైటిల్ సాంగ్ కూడా రావడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  గాడ్ ఫాద‌ర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.