కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి.. పుష్కర ఘాట్లు మునిగిపోయాయి

కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి.. పుష్కర ఘాట్లు మునిగిపోయాయి

మహదేవపూర్ : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద కలిసిన తర్వాత గోదావరికి వరద తీవ్రత పెరుగుతుంది. 

బుధవారం (సెప్టెంబర్ 03) మొదటి ప్రమాద హెచ్చరికకు మించి12.520 మీటర్ల మేర ప్రవహించడంతో కాళేశ్వరం పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. నది సమీపంలోని సుమారు 100 ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అన్నారం – చండ్రుపల్లి మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు బంద్ అయ్యాయి. 

మేడిగడ్డ బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఇరిగేషన్ ఆఫీసర్లు బ్యారేజీ గేట్లు మొత్తం 85 ఓపెన్ చేసి నీటిని వదులుతున్నారు. కింది గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. .