స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలంలో మంగళవారం 11.5 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, రిజర్వాయర్ల నుంచి నీరు దిగువకు వస్తోంది.

ఎగువన వాజేడు మండలం పేరూరు వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. కొత్త నీటితో గోదావరి కళకళలాడుతోంది. - భద్రాచలం, వెలుగు