
గద్వాల, వెలుగు: గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ, సీతారామాంజనేయ స్వామి, నవగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన జీయర్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో పాదపూజ కార్యక్రమం నిర్వహించారు.