రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ లక్ష్యం.. 2031 నాటికి సాధిస్తామన్న గోద్రెజ్

రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ లక్ష్యం.. 2031 నాటికి సాధిస్తామన్న గోద్రెజ్

హైదరాబాద్​, వెలుగు: గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ 2031 నాటికి రూ.5 లక్షల కోట్ల మార్కెట్​క్యాప్​ను సాధించాలని టార్గెట్ ​పెట్టుకుంది. తన కొత్త లక్ష్యం, బ్రాండ్ గుర్తింపును ముంబైలో ప్రకటించింది.  వినియోగదారు ఉత్పత్తులు, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, వ్యవసాయం, రసాయనాల రంగాల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయనుంది. గత ఐదేళ్లుగా అమ్మకాలు, నికర లాభాల్లో 20 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధి రేటు సాధించామని కంపెనీ వెల్లడించింది. వార్షిక అమ్మకాల్లో 15 శాతం, ప్రతి షేరుకు ఆదాయం (ఈపీఎస్) లో 20 శాతం వృద్ధిని ఆశిస్తోంది. ప్రస్తుతం ఉన్న మూడు పబ్లిక్  లిస్టెడ్  కంపెనీలను ఐదుకు పెంచాలని భావిస్తోంది. 2035 నాటికి నెట్–జీరో ఆపరేషన్స్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించున్నామని చైర్‌‌‌‌పర్సన్ డిజిగ్నేట్ పిరోజ్‌‌‌‌షా గోద్రెజ్ తెలిపారు.