తెలంగాణలో గోలకొండ పత్రిక వచ్చి ఈ ఏడాదికి వందేళ్లయింది. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎన్ యాకయ్య పీహెచ్డీ పరిశోధనలో భాగంగా రాసిన పరిశోధనా గ్రంథం ‘గోలకొండ పత్రిక – సాహిత్య, సాంస్కృతిక చైతన్యం’ను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు ఈ వేడుక నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే అధ్యక్షత వహించనుండగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఆవిష్కర్తగా సీనియర్ సంపాదకుడు కె. రామచంద్రమూర్తి, విశిష్ట అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అతిథులుగా సీనియర్ ఎడిటర్లు వర్ధెల్లి మురళి, అల్లం నారాయణ, కట్టా శేఖర్ రెడ్డి, ఎన్. వేణుగోపాల్, రచయిత, పరిశోధకుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, హేతువాద ఉద్యమకారుడు ఎస్. వేదాంత హాజరుకానున్నారు. ఈ పుస్తకాన్ని తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ గండు మహేందర్ సమీక్షించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
►ALSO READ | మంచు కొండల మధ్య అందమైన కెంపు లోయ!
