జాతీయ అథ్లెట్ల ఎంపిక విషయంలో పారదర్శకత చాలా కీలకం

జాతీయ అథ్లెట్ల ఎంపిక విషయంలో పారదర్శకత చాలా కీలకం

న్యూఢిల్లీ: జాతీయ అథ్లెట్ల ఎంపిక విషయంలో పారదర్శకత చాలా కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయంలో ఇండియా చాలా వరకు మెరుగైందని చెప్పారు. బంధుప్రీతి ప్రభావం ఒకప్పుడు స్పోర్ట్స్​పై కూడా ప్రభావితం చూపిందన్నారు. ‘బంధుప్రీతి వల్ల  ఆటగాళ్ల ఎంపికలోనూ పారదర్శకత లోపించింది. ఇది చాలా పెద్ద అంశం. దీనివల్ల మన ప్లేయర్ల ప్రతిభ వృథా అయ్యింది.

ఈ కష్టాలను ఎదురించేందుకు జీవితాంతం పోరాడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. గోల్డ్‌‌, సిల్వర్‌‌ పతకాల మెరుపులు మన యంగ్‌‌స్టర్స్‌‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇది ప్రారంభం మాత్రమే. ఇండియా ఎప్పుడూ అలసిపోదు, అలాగని ఇక్కడితో ఆగిపోదు. మనం చాలా గోల్డ్‌‌ మెడల్స్‌‌ గెలిచే రోజులు ఎంతో దూరంలో లేవు’ అని మోడీ పేర్కొన్నారు.