
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 2023 అక్టోబర్ 03 మంగళవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 52 వేల 600కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ధర రూ. 660 తగ్గి రూ. 57 వేల 380కు చేరుకుంది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57 వేల 530 గా ఉంది. అర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57 వేల 380 గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 600ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57 వేల 380 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57 వేల 380గా ఉంది.
వెండి విషయానికి వస్తే.. 2023 అక్టోబర్ 03 మంగళవారం రోజున రూ. 2000 తగ్గిన వెండి... ప్రస్తుతం మార్కెట్ లో పది గ్రామల వెండి రూ. 735 గా ఉండగా, కేజీ వెండి రూ. 73 వేల 500గా పలుకుతోంది.