V6 News

Gold Rate: శనివారం భారీగా పెరిగిన బంగారం.. అనూహ్యంగా వెండి కేజీ రూ.9వేలు అప్

Gold Rate: శనివారం భారీగా పెరిగిన బంగారం.. అనూహ్యంగా వెండి కేజీ రూ.9వేలు అప్

Gold Price Today: నవంబర్ నెల చివర్లో బంగారం, వెండి రేట్లు షాకింగ్ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ కంటే సిల్వర్ చుక్కలు చూపిస్తోంది. ఇటీవల ప్రముఖ రచయిత ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకీ కేజీ వెండి 2026లో రూ.6 లక్షలకు చేరొచ్చని అంచనాలు పంచుకున్న తర్వాత వెండి విపరీతమైన ర్యాలీని కొనసాగిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవదిలోనే కేజీ రేటు రూ.20వేల దగ్గర వరకు పెరగటంపై మధ్యతరగతి భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే నవంబర్ 28తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 29న రూ.1360 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.136 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 29న):

హైదరాదాబాదులో రూ.12వేల 982
కరీంనగర్ లో రూ.12వేల 982
ఖమ్మంలో రూ.12వేల 982
నిజామాబాద్ లో రూ.12వేల 982
విజయవాడలో రూ.12వేల 982
కడపలో రూ.12వేల 982
విశాఖలో రూ.12వేల 982
నెల్లూరు రూ.12వేల 982
తిరుపతిలో రూ.12వేల 982

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు నవంబర్ 28తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 29న 10 గ్రాములకు రూ.1250 పెరుగుదలను చూసింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 29న):

హైదరాదాబాదులో రూ.11వేల 900
కరీంనగర్ లో రూ.11వేల 900
ఖమ్మంలో రూ.11వేల 900
నిజామాబాద్ లో రూ.11వేల 900
విజయవాడలో రూ.11వేల 900
కడపలో రూ.11వేల 900
విశాఖలో రూ.11వేల 900
నెల్లూరు రూ.11వేల 900
తిరుపతిలో రూ.11వేల 900

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. నవంబర్ 29న కేజీకి వెండి నవంబర్ 28తో పోల్చితే రూ.9వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 92వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.192 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.