
Gold Price Today: ఇప్పటికే అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారు వ్యాపారులు వివిధ ఆభరణాలపై రేట్లను తగ్గిస్తూ పలు ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెమ్మదించటంతో పాటు అమెరికా త్వరలోనే ట్రేడ్ డీల్ చేసుకునేందుకు ముందుకు రావటం పసిడి ధరలను ఆకాశం నుంచి కిందకు దిగేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే గడచిన కొన్ని రోజులుగా పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ సామాన్యులకు ఊరటను కలిగిస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు ఎలాంటి మార్పులు లేకుండానే స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 755, ముంబైలో రూ.8వేల 755, దిల్లీలో రూ.8వేల 770, కలకత్తాలో రూ.8వేల 755, బెంగళూరులో రూ.8వేల 755, కేరళలో రూ.8వేల 755, పూణేలో రూ.8వేల 755, వడోదరలో రూ.8వేల 760, అహ్మదాబాదులో రూ.8వేల 760, జైపూరులో రూ.8వేల 769, మంగళూరులో రూ.8వేల 754, నాశిక్ లో రూ.8వేల 757, అయోధ్యలో రూ.8వేల 769, నోయిడాలో రూ.8వేల 769, గురుగ్రాములో రూ.8వేల 769 వద్ద నేడు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పులు లేకుండానే స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 551, ముంబైలో రూ.9వేల 551, దిల్లీలో రూ.9వేల 566, కలకత్తాలో రూ.9వేల 551, బెంగళూరులో రూ.9వేల 551, కేరళలో రూ.9వేల 551, పూణేలో రూ.9వేల 551, వడోదరలో రూ.9వేల 556, అహ్మదాబాదులో రూ.9వేల 556, జైపూరులో రూ.9వేల 565, మంగళూరులోరూ.9వేల 550, నాశిక్ లో రూ.9వేల 553, అయోధ్యలో రూ.9వేల 565, నోయిడాలో రూ.9వేల 565, గురుగ్రాములో రూ.9వేల 565 ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 755 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల 551గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 9వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.