
గోల్డ్ బోర్డ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. లెక్కల్లోకి రాని బంగారాన్ని లీగలైజ్ చేసేందుకు వీలుగా తీసుకురానున్న గోల్డ్ బోర్డ్ పథకానికి ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిశాఖ తుది మెరుగులు దిద్దుతున్నాయి. ఈ పథకాన్ని త్వరలో ప్రకటించనున్నారు. లెక్కల్లోని రాని బంగారాన్ని ప్రకటించాలని ప్రజలకు ఆఫర్ ఇస్తారు. నిల్వపై కొంత పరిమితి విధిస్తారు. ఆ పరిమితి దాటిన బంగారాన్ని దాచుకున్నవారు ప్రకటించాల్సి ఉంటుంది. దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి పథకం క్లోజ్ అయ్యాక… కూడా లెక్కల్లోకి రాని బంగారం దాచుకుని ఉంటే భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తారు.