రికార్డ్ స్థాయిలో రూ.40 వేలు దాటిన బంగారం ధర

రికార్డ్ స్థాయిలో రూ.40 వేలు దాటిన బంగారం ధర

ఢిల్లీ : బంగారం ధర బ్రేక్ లేకుండా ముందుకు సాగుతోంది. బుధవారం బంగారం ధర రూ.300 పెరిగి ఆల్‌ టైమ్ హైలో రూ.39,970 కాగా..గురువారం కూడా రూ.250 పెరిగింది. దీంతో రూ.40 వేల మార్క్ ను దాటి రికార్డ్ సృష్టించింది. బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ రూ. 40,220గా ఉంది. పండుగ సీజన్ రాబోతుండటంతో స్థానిక జూయల్లర్స్‌ నుంచి బంగారానికి భారీగా డిమాండ్ వస్తున్నట్టు ట్రేడర్స్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌ లో స్పాట్ గోల్డ్ ధర ఆరేళ్ల గరిష్టానికి దగ్గరలో ఉన్నట్టు జియోజిత్ ఫైనాన్సి యల్ సర్వీసెస్‌ తెలిపింది.

స్థానిక జూయల్లర్స్ నుంచి భారీగా డిమాండ్ రావడం, గ్లోబల్‌ గా మాంద్యం నెలకొనడంతో ఈ యెల్లో మెటల్‌ నే సురక్షితమైన సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో బంగారం ధర పెరుగుతోంది. బంగారంతో పాటు వెండి ధర కూడా రాకెట్‌ లా దూసుకుపోతోంది. పండుగ సీజన్ రాబోతుండటంతో స్థానిక జూయల్లర్స్‌ నుంచి బంగారానికి భారీగా డిమాండ్ వస్తున్నట్టు ట్రేడర్స్ చెప్పారు.