పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు

పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు

న్యూఢిల్లీ: ఒక్కరోజులోనే బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గోల్డ్, సిల్వర్ ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.405 తగ్గగా..అంతే వేంగంగా శుక్రవారం రూ. 305 పెరిగింది. నేటి బులియన్‌ ట్రేడింగ్‌ లో 10గ్రాముల గోల్డ్ రూ.305 పెరిగి, రూ.32 వేల 690కి చేరింది. జ్యువెలరీ వ్యాపారుల నుంచి సేల్స్ ఊపందుకోవడంతో బంగారం ధర పెరుగుదల కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.

వెండిధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి, రూ.38 వేల450కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ వల్ల వెండిధర పెరిగింది. గురువారం ఒక్కరోజే బంగారం ధరూ.405 తగ్గడంతో ..వ్యాపారుల నుంచి ఫుల్ డిమాండ్ వచ్చిందని తెలిపాయి ట్రేడింగ్ వర్గాలు.