Gold Rates: మళ్లీ లక్షకు చేరిన గోల్డ్.. వెండి కేజీ రూ.లక్ష 25వేలు, హైదరాబాద్ రేట్లివే..

Gold Rates: మళ్లీ లక్షకు చేరిన గోల్డ్.. వెండి కేజీ రూ.లక్ష 25వేలు, హైదరాబాద్ రేట్లివే..

Gold Price Today: అంతర్జాతీయ పరిస్థితులు మళ్లీ దిగజారుతున్న వేళ ఖరీదైన లోహాల ధరలకు తిరిగి రెక్కలొచ్చాయి. బంగారం, వెండితో పాటు రాగి వంటి ఇతర ఖరీదైన లోహాల ధరల ర్యాలీకి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చర్యలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తాము ఉన్న నగరాల్లో రేట్లను ఇక్కడ పరిశీలించొచ్చు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 155, ముంబైలో రూ.9వేల 155, దిల్లీలో రూ.9వేల 170, కలకత్తాలో రూ.9వేల 155, బెంగళూరులో రూ.9వేల 155, కేరళలో రూ.9వేల 155, పూణేలో రూ.9వేల 155, వడోదరలో రూ.9వేల 160, జైపూరులో రూ.9వేల 170, లక్నోలో రూ.9వేల 170, మంగళూరులో రూ.9వేల 155, నాశిక్ లో రూ.9వేల 158, మైసూరులో రూ.9వేల 155, అయోధ్యలో రూ.9వేల 170, బళ్లారిలో రూ.9వేల 155, గురుగ్రాములో రూ.9వేల 170, నోయిడాలో రూ.9వేల 170 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.1700 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 988, ముంబైలో రూ.9వేల 988, దిల్లీలో రూ.10వేల 003, కలకత్తాలో రూ.9వేల 988, బెంగళూరులో రూ.9వేల 988, కేరళలో రూ.9వేల 988, పూణేలో రూ.9వేల 988, వడోదరలో రూ.9వేల 993, జైపూరులో రూ.10వేల 003, లక్నోలో రూ.10వేల 003, మంగళూరులో రూ.9వేల 988, నాశిక్ లో రూ.9వేల 993, మైసూరులో రూ.9వేల 988, అయోధ్యలో రూ.10వేల 003, బళ్లారిలో రూ.9వేల 988, గురుగ్రాములో రూ.10వేల 003, నోయిడాలో రూ.10వేల 003గా ఉన్నాయి.   

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 550 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 880గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 25వేల వద్ద ఉంది.