
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో బలహీనమైన ట్రెండ్వల్ల బుధవారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.650 తగ్గి రూ.96,850కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర మునుపటి మార్కెట్ సెషన్‌లో 10 గ్రాములకు రూ.97,500 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రేటు రూ.700 తగ్గి రూ.96,400కి చేరుకుంది.
మంగళవారం ఇది 10 గ్రాములకు రూ.97,100 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర రూ. 1,450 తగ్గి రూ. 98 వేలకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 20.65 డాలర్లు తగ్గి 3,229.64 డాలర్లకు చేరింది.