మంగళవారం రూ.1,450 తగ్గిన బంగారం ధర

మంగళవారం రూ.1,450 తగ్గిన బంగారం ధర
  • వెండి ధర రూ. 2,300  డౌన్​

న్యూఢిల్లీ: బంగారం ధరలు శాంతిస్తున్నాయి. వరుసగా రెండో రోజైన మంగళవారం వీటి ధరలు తగ్గాయి.  పది గ్రాముల బంగారం ధర రూ.1,450 తగ్గి రూ.72,200కి చేరింది.  వెండి ధర కూడా కిలోకు రూ.2,300 తగ్గింది.  ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,450 తగ్గి రూ.72,200కి చేరుకుంది. క్రితం సెషన్‌‌లో   10 గ్రాముల ధర రూ.73,650 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.2,300 తగ్గి రూ.83,500లకు చేరింది. 

క్రితం ముగింపులో కిలో రూ.85,800 వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్ల నుంచి బేరిష్ సూచనల మధ్య రూ. 1,450 తగ్గిందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్‌‌లోని కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో కమోడిటీ ఎక్స్చేంజ్​ వద్ద స్పాట్ బంగారం ఔన్సుకు (28 గ్రాములు) 2,310 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 55 డాలర్లుతగ్గింది.   హైదరాబాద్​లో  10 గ్రాముల బంగారం ధర రూ.1,530 తగ్గి రూ.72,160కి చేరుకుంది. వెండి ధర రూ.86,500లకు పడిపోయింది.