- యూఎస్ బాండ్ రాబడులు, డాలర్ వాల్యూ పెరగడమే కారణం
- మీడియం నుంచి లాంగ్ టెర్మ్‌లో మాత్రం గోల్డ్ రేట్లు పైకే
- క్వాంటమ్ అసెట్ మేనేజ్మెంట్ రిపోర్ట్‌లో వెల్లడి
బిజినెస్ డెస్క్, వెలుగు: షార్ట్ టెర్మ్‌లో గోల్డ్ రేట్లు తగ్గేలా కనిపిస్తున్నాయి. యూఎస్ బాండ్ ఈల్డ్ (రాబడు) లు పెరగడంతో గోల్డ్‌పై ఒత్తిడి ఎక్కువవుతోంది. యూఎస్ బాండ్ ఈల్డ్‌లు పెరిగితే ఇన్వెస్ట్మెంట్లు గోల్డ్ అసెట్ల నుంచి బాండ్లలోకి వెళుతుంటాయి. దీంతో గోల్డ్ రేట్లు తగ్గుతాయి. ఫెడ్ మానిటరీ పాలసీ వలన యూఎస్ డాలర్ బలపడుతోంది. దీంతో రూపాయి వంటి ఇతర కరెన్సీల్లో కొనేవారికి గోల్డ్ ఖరీదుగా మారుతుంది. దీని వలన షార్ట్‌టెర్మ్‌లో గోల్డ్ డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ – రష్యా సంక్షోభం చివరి దశకు చేరుకోవడంతో కూడా గోల్డ్ రేట్లు షార్ట్ టెర్మ్‌లో తగ్గొచ్చని క్వాంటమ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పేర్కొంది. గ్లోబల్‌గా అనిశ్చితి వాతావరణం ఏర్పడినప్పుడు గోల్డ్ రేట్లు బాగా పెరుగుతాయి. అనిశ్చితి వాతావరణం లేకపోతే గోల్డ్ రేట్లు తగ్గుతాయి. దేశంలో గోల్డ్ రేట్లు బుధవారం కూడా తగ్గాయి. ఎంఎసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ (10 గ్రాముల) రేటు రూ. 51,360 గా ఉంది. కేజీ సిల్వర్ రూ. 66,075 దగ్గర ట్రేడవుతోంది.
గోల్డ్‌కు సపోర్ట్‌గా గ్లోబల్ ఇన్ఫ్లేషన్..
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలై నెల గడచింది. ఈ సంక్షోభం సెటిల్మెంట్ స్టేజ్ చేరిందని క్వాంటమ్ ఏఎంసీ సీఐఓ చిరాగ్ మెహతా పేర్కొన్నారు. లేకపోతే యుద్ధం మరింత ముదరొచ్చని, నూక్లియర్ బాంబులను రష్యా వాడొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్ రేట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. యుద్ధం సెటిల్మెంట్ స్టేజ్‌కి వచ్చినా, ఈ యుద్ధ ప్రభావం అధ్వాన్నంగా ఉండడంతో గోల్డ్‌కు సపోర్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా రష్యాపై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. దీంతో గ్లోబల్‌గా ఎనర్జీ క్రైసిస్ ఉంటుందని, ఫుడ్ సప్లయ్ చెయిన్‌లో అంతరాయాలు ఏర్పడతాయని, ఇన్ఫ్లేషన్ మరింత పెరుగుతుందని చెప్పారు. షార్ట్ టెర్మ్‌లో గోల్డ్ రేట్లు తగ్గినా, మీడియం నుంచి లాంగ్ టెర్మ్‌లో గోల్డ్ రేట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. అందుకే మీడియం నుంచి లాంగ్ టెర్మ్‌కు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని సలహాయిచ్చారు.
గోల్డ్‌కు అడ్డుగా ఫెడ్..
వడ్డీ రేట్లను పెంచడంతో పాటు మానిటరీ పాలసీని వేగంగా సాధారణ స్థాయికి తీసుకురావాల్సి ఉందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బోర్డు గవర్నర్ లేల్ బ్రైనార్డ్ పేర్కొన్నారు. దీంతో యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ రికార్డ్ లెవెల్ అయిన 2.5 శాతాన్ని క్రాస్ చేసింది. రష్యాపై వెస్ట్రన్ దేశాలు కొత్తగా ఆంక్షలు పెడతారనే వార్తలతో గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతున్నా, యూఎస్ బాండ్ ఈల్డ్‌లు పెరగడంతో పాటు, ఫెడ్ మానిటరీ పాలసీలో రేట్ల పెంపు ఉంటుందనే అంచనాలు ఈ డిమాండ్ తగ్గడానికి కారణమవుతున్నాయని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్) రాహుల్ కలాంత్రి అన్నారు. యూఎస్ మానిటరీ పాలసీని నూట్రల్ పొజిషన్‌కు తెచ్చేందుకు సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను వేగంగా తగ్గించడమే కాకుండా, దశల వారీగా రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ గవర్నర్ లేల్ బ్రైనార్డ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమె స్టేట్మెంట్ తర్వాత డాలర్ ఇండెక్స్ 99 లెవెల్‌ను టచ్ చేసింది. యూస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 2.55 శాతాన్ని క్రాస్ చేసింది. దీంతో గోల్డ్, సిల్వర్లపై ఒత్తిడి పెరుగుతోంది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తారనే వార్తలు రావడం, గ్లోబల్‌గా ఇన్‌ప్లేషన్ పెరగడం వంటివి గోల్డ్‌కు సపోర్ట్ ఇస్తున్నాయని కలాంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది మరో ఆరు సార్లు వడ్డీ రేట్లను పెంచాలని ఫెడ్ చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కీలక వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న 0.25 % నుంచి 2.5 శాతానికి పెంచాలని ప్లాన్స్ వేసుకుంది. యూఎస్ ఎకానమీ స్లోడౌన్‌లో ఉండడం, ఆ దేశ ఇన్ఫ్లేష్ కూడా పెరగడంతో వడ్డీ రేట్లను అనుకున్నంతగా పెంచుతారా? అనే అంశంపై అనుమానాలూ ఉన్నాయి. యూఎస్ ఎకానమీ మెరుగ్గా లేకపోవడంతో గోల్డ్‌కు మద్ధతు దొరుకుతుందని ఎనలిస్టులు అంటున్నారు.