బంగారం ఇప్పుడు కొనొచ్చా .. కొన్నాళ్లు ఆగాలా..? : ధరలు భారీగా ఎందుకు తగ్గుతున్నాయి..?

బంగారం ఇప్పుడు కొనొచ్చా .. కొన్నాళ్లు ఆగాలా..? : ధరలు భారీగా ఎందుకు తగ్గుతున్నాయి..?

బంగారం, వెండి ధరలు వరుసగా పడుతున్నాయి. గత వారం రోజులుగా పసడి, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఏకంగా 6 నెలల కనిష్టానికి బంగారం ధరలు పడిపోవడం విశేషం.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. అక్టోబర్ 3వ తేదీ మంగళవారం బంగారం రూ. 600 తగ్గింది.  ప్రస్తుతం24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 660 తగ్గి రూ. 57,380కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర  రూ. 600 తగ్గి..రూ. 52,600 పలుకుతోంది. 

అటు  వెండి సైతం బంగారం బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర ఏకంగా రూ. 2,000 తగ్గింది. దీంతో మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి రూ. 73,500కు చేరుకుంది. 

 దేశంలోని బంగారం  ధరలను గమనిస్తే ఢిల్లీలో 24 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర  రూ. 57,530గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,380గా ఉంది.  చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ. 57,710గా పలుకుతోంది.  బెంగళూరులో  10 గ్రాముల బంగారం ధర రూ. 57,380గా.. కోల్‌కతాలో 140 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,380గా పలుకుతోంది. 

ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం, ప్రత్యేకించి వడ్డీ రేట్ల కారణంగా హైదరాబాద్  సహా ఇతర  నగరాల్లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీంతో పాటు.. అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్‌లు పెరగడంతో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే సంకేతాల మధ్య బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు దాదాపు 20.77 డాలర్ల వద్ద ఉంది.