Gold Price Update - రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు

Gold Price Update - రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు

Gold Price Update - దేశంలో బంగారం ధరలు గత 24 గంటల్లోనే అకస్మాత్తుగా పెరిగాయి. 24, 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.50 పెరుగుదల నమోదైంది. ఇయ్యాళ 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 55,290 కాగా 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 50,460 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,285 (10 గ్రా.) ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రా.) రూ. 47,927 గా ఉంది.

 దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 55,680, 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 51,050. అదేవిధంగా కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రా.) ధర రూ. 55,530, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 50,900. ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రా.) రూ. 55,530 కాగా 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 50,900 గా నమోదైంది.

గ్లోబల్ ట్రెండ్‌లు యుఎస్ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ అత్యంత బలహీనపడింది. అదే బంగారం ధర పెరగడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న పెట్టుబడిదారులు, వినియోగదారులు ఇప్పుడు అకస్మాత్తుగా పెరిగిన ధరల కారణంగా మరింత చెల్లించాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరల్లో పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా లేదా ధరలు స్థిరంగా ఉంటాయా అనేది చూడాలని అంటున్నారు. పెట్టుబడిదారులు, వినియోగదారులు మార్కెట్‌ను నిశితంగా గమనించి తర్వాతే తమ పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు.