రాగికి పూత పూసి రూ. 20 వేల కోట్ల టోపీ

రాగికి పూత పూసి రూ. 20 వేల కోట్ల టోపీ

చైనాలో గోల్డ్ ప్రాసెసింగ్ కంపెనీ ఘరానా మోసం
ఫిబ్రవరిలో ఓ కంపెనీ చేసిన టెస్టుల్లో గిల్ట్ రాగి అని తేలిన వైనం
ఆ తర్వాత టెస్టులు చేసిన అన్ని కంపెనీలు
అయినా అది ప్యూర్ గోల్డేనని కంపెనీ ఓనర్ వాదన
లిస్ట్నుంచి తొలగించిన షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్
షేక్ అయిన చైనా గోల్డ్ మార్కెట్

బీజింగ్​: తులం కాదు.. రెండు తులాలు కాదు.. ఏకంగా 83 టన్నుల బంగారం.. తాకట్టు పెట్టి లోన్​ తీసుకుందో పెద్ద గోల్డ్​ కంపెనీ. 14 ఫైనాన్స్​ కంపెనీలు, బ్యాంకులు చెక్​చేయకుండానే రూ.20 వేల కోట్లు అప్పుగా ఇచ్చేశాయి. ఏముందీ ఆ తర్వాత సదరు కంపెనీ లోన్లు ఎగ్గొట్టడం.. షూరిటీగా పెట్టిన బంగారాన్ని ఓ బ్యాంకు చెక్​ చేయడం జరిగిపోయాయి. ఆ చెకింగ్​లో అది అసలు బంగారం కాదు.. కాకి
బంగారం అని తేలింది. ఇంకేముందీ మిగతా బ్యాంకులు తలలుపట్టుకున్నాయి. ఈ ఘరానా మోసం కరోనా వైరస్​ పుట్టిన చైనాలోని వుహాన్​లోనే జరిగింది.

గిల్ట్​ కాపర్​ పెట్టి.. బంగారం అని నమ్మించి…
ఇంత పెద్ద మోసానికి పాల్పడింది హ్యూబెయ్​ ప్రావిన్స్​లోనే అతిపెద్ద ప్రైవేట్​ గోల్డ్​ ప్రాసెసింగ్​ సంస్థ కింగోల్డ్​. దాని చైర్మన్​గా ఉన్న జియా ఝిహోంగ్​.. 83 టన్నుల నకిలీ బంగారాన్ని షూరిటీగా పెట్టి 14 సంస్థల నుంచి 280 కోట్ల డాలర్ల లోన్లు తీసుకున్నాడు. మన కరెన్సీలో ఆ అప్పు విలువ దాదాపు రూ.20,924 కోట్లు. అంతేకాదు.. ఒకవేళ ఆ బంగారం కాని బంగారం పోతే ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు దానిపై ఇన్సూరెన్స్​ కూడా చేయించాడు జియా. అయితే, ఆ తర్వాత జియా లోన్లను తిరిగి కట్టలేదు. బ్యాంకులు, సంస్థలను మోసం చేశాడు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో డోంగ్వాన్​ ట్రస్ట్​ కో లిమిటెడ్​ అనే సంస్థ కింగోల్డ్​ పెట్టిన ఆ షూరిటీ ‘బంగారాన్ని’ మార్చేందుకు చూసింది. కానీ, టెస్టింగ్​లో అది గిల్డ్​ కాపర్​ అని తేలింది. దీంతో ఆ సంస్థ తల పట్టుకుంది. ఆ ఘటనతో కింగోల్డ్​కు అప్పులిచ్చిన సంస్థలు కంగుతిన్నాయి. కింగోల్డ్​కు అతిపెద్ద క్రెడిటర్​ (అప్పులిచ్చే సంస్థ) అయిన మిన్షెంగ్​ ట్రస్ట్​ కో లిమిటెడ్​ అనే సంస్థ కోర్టు మెట్లెక్కింది. సంస్థ లాకర్లలో ఉన్న కింగోల్డ్​ బంగారాన్ని చెక్​ చేసేందుకు అనుమతి తెచ్చుకుంది. మే 22న వచ్చిన టెస్ట్​ రిజల్ట్స్​లో అది రాగి అని తేలింది. దాని తర్వాత మరో రెండు సంస్థలూ, ఆ తర్వాత మిగతా సంస్థలు తాకట్టు పెట్టిన బంగారాన్ని టెస్ట్​ చేసి నకిలీ గోల్డ్​గా తేల్చాయి. సంస్థలు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు దానిపైనే చైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తాను పెట్టింది నకిలీ గోల్డ్​ కానే కాదంటూ జియా చెబుతున్నాడు. ఈ మోసంతో జియా కంపెనీ కింగోల్డ్​ను మెంబర్ల జాబితా నుంచి జూన్​ 24న షాంఘై గోల్డ్​ ఎక్స్​చేంజ్​ తొలగించేసింది.

ఆర్మీలో పనిచేసి.. కంపెనీని కొని
చైనా ఆర్మీ పీఎల్​ఏలో పనిచేసిన జియా ఝిహోంగ్​ 2002లో కింగోల్డ్​ సంస్థను పెట్టాడు. నాస్డాక్​లోనూ లిస్ట్​ అయిన ఆ కంపెనీ నిజానికి అంతకుముందు పీపుల్స్​ బ్యాంక్​ ఆఫ్​చైనాతో (పీబీవోసీ)తో అఫిలియేట్​ అయిన ఓ గోల్డ్​ ఫ్యాక్టరీ. బ్యాంక్​ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆ కంపెనీ బ్యాంకు నుంచి వేరైంది. దీంతో పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీలో పనిచేసేటప్పుడు గోల్డ్ మైన్స్​ను మేనేజ్​ చేసిన జియా ఆ ఫ్యాక్టరీని కొన్నాడు.

మిగతా గోల్డ్​ కంపెనీలు షేక్
​ఈ ఘరానా మోసంతో దేశంలోని మిగతా గోల్డ్​ కంపెనీలు షేక్​ అయ్యాయి. సోషల్​ మీడియాలో ఆ ఫేక్​ గోల్డ్​ పైనే చర్చలు మొదలయ్యాయి. ఒక్క కంపెనీ దగ్గరే అంత ఫేక్​ గోల్డ్​ ఉంటే మొత్తం బంగారం మార్కెట్​లో ఎంత నకిలీ బంగారం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే చైనా అతిపెద్ద గోల్డ్​ ప్రొడ్యూసర్​ అని, అలాంటి దేశంలో ఎంత ఫేక్​ గోల్డ్​ ఉందని సైఫీదీన్​ యామస్​ అనే రైటర్​ ప్రశ్నించాడు. ఆ ఫేక్​ గోల్డ్​ వల్లే చైనా గోల్డ్​ మార్కెట్​ ఏటా 5 నుంచి 15 శాతం పెరుగుతోందా అని అన్నాడు. ఏటా చైనా ఉత్పత్తి చేసే బంగారంతో పోలిస్తే కింగోల్డ్​ తాకట్టు పెట్టిన బంగారం కాని బంగారం వాటా 22 శాతం. 2019 లెక్కల ప్రకారం ఆ దేశ గోల్డ్​ రిజర్వ్స్​తో పోలిస్తే తాకట్టు పెట్టిన ఈ నకిలీ బంగారం విలువ 4.2%.

For More News..

పెళ్లయిన 19 రోజులకే.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి