పసిడి ధర పైపైకే

పసిడి ధర పైపైకే

వచ్చే రెండేళ్లలో రూ.68 వేలకు గోల్డ్ ధర

ధరల ధగధగ 

గోల్డ్‌కొనేందుకు ఎగబడుతున్న జనాలు

వెలుగు, బిజినెస్‌‌డెస్క్: కరోనా కాలంలో అన్ని రంగాలూ కుదేలవుతుంటే, మరోవైపు గోల్డ్‌‌ ధర ధగధగా మెరిసిపోతోంది. రాబోయే రెండేళ్లలో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ. 68 వేలకు చేరుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎకానమీలకు కష్టాలెదురైన టైములో భద్రత కోసం అందరూ బంగారం వైపు చూడటం సాధారణమైనదేనని వారు చెబుతున్నారు. వైరస్ కష్టాలతో వివిధ దేశాల ఎకానమీలన్ని కష్టంగా నెట్టుకొస్తున్నాయి. ఎవర్ని కదిలించినా.. ఏ రంగాన్ని మెదిలించినా.. కరోనా నష్టాలే కనిపిస్తున్నాయి.ఒక్క గోల్డ్ మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలుస్తోంది. గత రెండు నెలల కాలంలో బ్రేక్ లేకుండా గోల్డ్ ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశంలో గోల్డ్ ధరలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం తులం రేటు మంగళవారంనాడు రూ.50 వేలకు మించిపోయింది.

ఈ ట్రెండ్ కంటిన్యూగా గోల్డ్‌‌పై పాజిటివ్‌‌గా నిలుస్తోందని ఏంజిల్ బ్రోకింగ్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ రీసెర్చ్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా తెలిపారు. జియోపొలిటికల్ టెన్షన్స్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గ్లోబల్ ఎకనమిక్ అంచనాలను కుదించడం వంటి కారణాలతో గోల్డ్ పైపైకి చూస్తోందని పేర్కొన్నారు. వచ్చే 18–24 నెలల్లో గోల్డ్ ధరలు ఇండియాలో రూ.65 వేల నుంచి రూ.68 వేలను తాకుతాయని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ హెడ్ కిషోర్ నార్నే అంచనావేసారు. ఇది డాలర్ వెర్సర్ రూపాయి ట్రేడింగ్‌‌పై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. డాలర్ ఇండెక్స్ బలహీనపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం కూడా గోల్డ్ ధరలకు సపోర్ట్‌‌గా నిలుస్తున్నట్టు అనుజ్ గుప్తా తెలిపారు. డాలర్ ఇండెక్స్ ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ప్రస్తుతం 96.45 వద్ద ట్రేడవుతోంది. ఇది మూడేళ్ల గరిష్ట స్థాయి 102.99 నుంచి దిగొచ్చింది. వచ్చే ఒకటి లేదా రెండు నెలలు గోల్డ్ ధర రూ.50 వేల నుంచి రూ.51 వేల మధ్యలో ట్రేడవుతుందని చెప్పారు.

కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ ఎకానమీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, రికవరీ కూడా చాలా నిదానంగా ఉందని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. అంతకుముందు అంచనావేసిన దానికంటే ఎక్కువగానే గ్లోబల్‌‌ అవుట్‌‌పుట్ పడిపోతుందని చెప్పింది. గ్లోబల్ అవుట్‌‌పుట్ 4.9 శాతానికి, ఎమర్జింగ్ మార్కెట్ల అవుట్‌‌పుట్ 3 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. మరోవైపు ఇండియన్ గ్రోత్ అవుట్‌‌లుక్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.9 శాతం నుంచి మైనస్ 4.5 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ తాజాగా అంచనావేసింది. కరోనా లాక్‌‌డౌన్ పొడిగించడం, ఎకానమీ రివైవల్ నెమ్మదిగా ఉండటంతో, ఇండియా గ్రోత్ అంచనాలను కుదించినట్టు పేర్కొంది. ఇండియాతో పాటు గ్లోబల్‌‌గా కూడా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. అమెరికా, చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ గోల్డ్ ధరలు పెరిగేందుకు సహకరిస్తున్నాయి. అంతేకాక ఇండియాకు, చైనాకు సరిహద్దులో టెన్షన్లు నెలకొన్నాయి. అప్పటినుంచి ఇన్వెస్టర్లు గోల్డ్ కొనడానికి ఎగబడుతున్నారు. దీంతో దేశీయంగా గోల్డ్ ధరలు రికార్డు స్థాయిలకు చేరుకుంటున్నాయి. గ్లోబల్ మార్కెట్‌‌లో కూడా స్పాట్ గోల్డ్ ధర 0.3 శాతం పెరిగి ఔన్స్‌‌కు 1,772.43 వద్ద ట్రేడవుతోంది.

For More News..

‘ఆర్ఆర్ఆర్’ లో భగత్ సింగ్ గా అజయ్ దేవగన్

ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్