ధన త్రయోదశి : బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. హైదరాబాద్ లో తరుగు ఆఫర్స్ ఎవరెలా ఇస్తున్నారు..?

ధన త్రయోదశి : బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. హైదరాబాద్ లో తరుగు ఆఫర్స్ ఎవరెలా ఇస్తున్నారు..?

ధన త్రయోదశి సందర్భంగా చాలా మంది బంగారం కొనేందుకు శుభముహూర్తంగా భావిస్తుంటారు.  ధన త్రయోదశి రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే, అదృష్టం కలిసి వస్తుందనే అందరూ ఎక్కువగా నమ్ముతుంటారు.   దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినం తోనే ప్రారంభిస్తారు. అటువంటి ధన త్రయోదశి పండుగ ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీన జరుపుకోనున్నారు. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 11వ తేదీ మరుసటి రోజు మధ్యాహ్నం 1. 57 నిమిషాలకు ముగుస్తుంది.ధన త్రయోదశి పండుగ రోజున కుబేరుడిని, ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు. 

దేశవ్యాప్తంగా 2023 నవంబర్ 06న  బంగారం ధరలు  ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 56 వేల 350 గా ఉంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 170 తగ్గి రూ. 61 వేల 470 గా ఉంది. హైదరాబాద్ లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56 వేల 350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61 వేల 470 గా ఉంది.  ఇక ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి రూ.200 పెరిగింది.  కేజీ వెండి రూ. 78 వేల 200 గా ఉంది.  

ధన త్రయోదశి హైదరాబాద్ లోని పలు జ్యూయెలరీ షాపులు ఆఫర్లు ప్రకటిస్తూ  జనాలను  ఆకట్టుకుంటున్నాయి.  తరుగుపై 50 శాతం డిస్కంట్,  సాధారణ వెండి వస్తువులపై మజారీ ఛార్జీలు  లేవు,  రాళ్ల ఆభరణాలపై రాళ్ళ తూకం మినహాయింపు, క్రెడీట్ కార్డులపై బంఫర్ ఆఫర్లు  ప్రకటిస్తూ జనాలను తమవైపు తిప్పుకుంటున్నాయి.