ఫెస్టివల్​ షాపింగ్ : 5 వేల కంటే ఎక్కువ కొనం!

ఫెస్టివల్​ షాపింగ్ :  5 వేల కంటే ఎక్కువ కొనం!
  •     ఆన్​లైన్​లో కొంటామన్న 22 శాతం మంది
  •     వెల్లడించిన యాక్సిస్​మై ఇండియా సర్వే

న్యూఢిల్లీ: ఈసారి ఫెస్టివల్​ షాపింగ్​ కోసం కాస్త తక్కువే ఖర్చు పెట్టాలని జనం నిర్ణయించుకున్నారు. మరింత మంది  ఆన్​లైన్​లో షాపింగ్​ చేయడానికి రెడీ అవుతున్నారు.   డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వే ద్వారా ఈ విషయాలు తెలిశాయి. ఈసారి 56శాతం మంది రెస్పాండెంట్లు షాపింగ్​కు రూ. ఐదు వేలకు మించి ఖర్చు చేయబోమని చెప్పారు.

అయితే 24శాతం మంది రూ. ఐదు వేలు –-  రూ. 10 వేల మధ్య ఖర్చు చేస్తామని అన్నారు. మరో 11శాతం మంది రెస్పాండెంట్లు రూ. 10 వేలు –-  రూ. 20వేల మధ్య ఖర్చు చేయాలని చూస్తున్నారు. అయితే 7 శాతం మంది మాత్రం రూ.రెండు లక్షల వరకు జేబు నుంచి తీయడానికి రెడీ అంటున్నారు. 22శాతం మంది రెస్పాండెంట్లు ఆన్​లైన్​లో షాపింగ్​ చేయనున్నారు.

ఇది వరకే 25శాతం మంది రెస్పాండెంట్లు ఈ సీజన్‌‌లో షాపింగ్​కు డబ్బును రెడీ చేసుకున్నారు. 25శాతం మంది రెస్పాండెంట్లు గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ షాపింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. అయితే 23శాతం మంది గత సంవత్సరం మాదిరే కొంటామన్నారు.   13శాతం మంది రెస్పాండెంట్లు కొత్త మొబైల్ ఫోన్‌‌పై దృష్టి పెట్టారు, అయితే 12శాతం మంది రెస్పాండెంట్లు ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు కొంటామని చెప్పారు.  ఐదు శాతం మంది వెహికల్స్​ను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  

19శాతం మంది రెస్పాండెంట్లు దీపావళి వేడుకల కారణంగా జీతం బోనస్‌‌ను అందుకున్నారు.  ఈ సర్వేలో 27 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,980 మంది పాల్గొన్నారు.  

ఖర్చులు పెరిగాయ్​..

సర్వేలో పాల్గొన్న వాటిలో 60 శాతం కుటుంబాల ఖర్చులు పెరిగాయి. గత నెలతో పోలిస్తే 7శాతం అధికమయ్యాయి. ఈసారి కొత్త బట్టలు కొంటామని 67శాతం మంది చెప్పారు. ఫ్యాషన్​ కోసం డబ్బు ఖర్చు చేయడానికి రెడీ అని మెజారిటీ రెస్పాండెంట్లు వెల్లడించారు. వీరిలో అత్యధికులు ఆన్​లైన్​లో కాకుండా సాధారణ దుకాణాల్లోనే కొంటామని అన్నారు. ఇంటి ఖర్చులు 60శాతం కుటుంబాలకు పెరిగాయి.

ఇది గత నెలతో పోలిస్తే 7శాతం పెరిగింది. 31శాతం కుటుంబాలకు వినియోగం నిలకడగా ఉంది.   పర్సనల్​ కేర్​, హోం అప్లియెన్సెస్​  వంటి  ఖర్చులు 44 శాతం కుటుంబాలకు పెరిగాయి. ఈ విషయంలో 40శాతం కుటుంబాలకు వినియోగం అలాగే ఉంది.  ఎనిమిది శాతం కుటుంబాలకు  ఏసీ, కార్  రిఫ్రిజిరేటర్‌‌ల వంటి కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. మరో 86 శాతం కుటుంబాలకు వినియోగం అలాగే ఉంది.

విటమిన్లు, పరీక్షలు  ఆరోగ్యకరమైన ఆహారం వంటి ఆరోగ్య సంబంధిత వస్తువులపై ఖర్చులు 37శాతం కుటుంబాలకు పెరిగాయి. ఇది గత నెలతో పోలిస్తే 1శాతం పెరిగింది. 48శాతం కుటుంబాలకు వినియోగం అలాగే ఉంది. మీడియా (టీవీ, ఇంటర్నెట్, రేడియో మొదలైనవి) వినియోగం 20శాతం కుటుంబాలకు పెరిగింది. ఏడు శాతం కుటుంబాలకు ట్రాన్స్​పోర్ట్​ ఖర్చులు పెరిగాయి. 82శాతం కుటుంబాలకు మాత్రం ఇవి మారలేదు.