సౌత్ ఇండియన్స్ ఫేవరెట్ టిఫిన్స్‌లో వడ ఒకటి. దక్షిణ భారతదేశంలో చాలా మంది వడను ఎంతో ఇష్టంగా తింటారు. వడ, సాంబార్ కాంబినేషన్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే అర్ధం చేసుకోవచ్చు వడ టేస్ట్ ఎలాంటిదో. అయితే.. వడ తినే వారిలో చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది.
అదేంటంటే.. వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందని. దీనికి సరైన సమాధానం చాలా మందికి తెలియదు. అయితే.. వడ మధ్యలో హోల్ వెనక చాలా కారణాలే ఉన్నాయంటా. ఇందులో ముఖ్యంగా మూడు కారణాలు చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. అవేంటో తెలుసుకుందాం మరీ..!
వడ మధ్యలో రంధ్రం పెట్టడానికి ప్రధాన కారణం వడను లోపల, బయట సమానంగా వేయించడం. వడలు సాధారణంగా మందంగా ఉంటాయి. కాబట్టి వడ మధ్యలో రంధ్రం లేకుండా నూనెలో వేయించినట్టయితే బయట భాగం త్వరగా ఉడికిపోతుంది. కానీ లోపల పిండి అలాగే పచ్చిగా ఉంటుంది. అదే మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించితే బయట భాగంతో పాటు లోపల కూడా సరిగ్గా ఉడికి వడ కరకరలాడుతుంది. సో.. వడకు హోల్ పెట్టడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి.
వడ షేప్ అవుట్ కాకుండా కూడా మధ్యలో రంధ్రం పెడతారంట. వడ మధ్యలో రంధ్రం చేయకపోతే అది బాగా ఉబ్బుతుంది. దీంతో వడ మృదుత్వం, సరిగ్గా ఉడక టేస్ట్ పోతుందట. ఈ కారణం చేత కూడా వడకు మధ్యలో హోల్ పెడతారంట. ఇక, వడ మధ్యలో రంధ్రం పెట్టడం ద్వారా లోపల, బయట మంచిగా కాలి కరకరలాడుతుందట. ఇందుకోసం కూడా వడకు మధ్యలో హోల్ పెడతారంట. వడ మధ్యలో రంధ్రం పెట్టడానికి ప్రధానంగా ఈ మూడు కారణాలను పేర్కొంటున్నారు చెఫ్‌లు.
