పాట్నా: ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించడం బిహార్‌లో ‘జంగిల్ రాజ్’ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిందని కేంద్ర మంత్రి, లోక్ జన్ శక్తి పార్టీ(రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఎన్డీయే తమ సొంత సీఎం అభ్యర్థిని ప్రకటించలేకపోతుందని ఇటీవల తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేయడంతో చిరాగ్ పాశ్వాన్ సమాధానమిచ్చారు. సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయే అభ్యర్థి అని చెప్పారు.
“ఆర్జేడీ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడితో తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. తేజస్వీని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా రాహుల్ గాంధీ ఎందుకు అడ్డుకోలేదంటే ఆయన పేరు ప్రకటించగానే ప్రజలు జంగిల్ రాజ్‌ను గుర్తుచేసుకుని భయపడతారని తెలుసు. తేజస్వీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా గెలుపు అవకాశాలను ఇండియా కూటమి దూరం చేసుకుంది’’ అని పేర్కొన్నారు.
