
- మరోసారి రూ.లక్ష దాటిన గోల్డ్.. రూ.3,000 పెరిగిన వెండి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం ధరలు మంగళవారం రూ.1,000 పెరిగి రూ. లక్షకు చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి 10 గ్రాముల ధర సోమవారం రూ.99,020 వద్ద ముగిసింది. తాజాగా నాలుగు వారాల గరిష్ట ధర రూ.1,00,020 వద్ద ముగిసింది. ఈ ఏడాది జూన్ 19న బంగారం రూ.లక్ష వద్ద ట్రేడయింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర మంగళవారం రూ.1,000 పెరిగి రూ.99,550 వద్ద ముగిసింది. గత మార్కెట్ ముగింపులో ఇది 10 గ్రాములకు రూ.98,550 వద్ద ముగిసింది.
వెండి ధర కూడా మంగళవారం కిలోగ్రాముకు రూ.3,000 పెరిగి రూ.1,14,000కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ బంగారం 0.28 శాతం తగ్గి ఔన్సుకు (28.3 గ్రాములు) 3,387.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ వెండి కూడా ఔన్సుకు 0.11 శాతం తగ్గి 38.89 డాలర్లకు చేరుకుంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,850లకు, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,290లకు చేరింది. వెండి ధర రూ.1.28 లక్షలకు ఎగిసింది.