పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మార్చి నెలలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభంకానున్న క్రమంలో బంగారం ధరలు పెరుగొచ్చని ఇప్పటికే నిపులు తెలిపారు. దీంతో ముందే బంగారం ఆభరణాలను కొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.  2024, మార్చి 2వ తేదీ శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.850 పెరగగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.930 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. 

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర  రూ. 58,750ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,090కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరమైన విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక,  కిలో వెండిపై 500 రూపాయలు పెరిగింది. దీంతో  కిలో వెండి ధర రూ.75,000గా ఉంది.

Also Read: రూ.2వేల నోట్లు ఇప్పటికీ చెల్లుతాయ్​

దేశంలో బంగారం ధరలు

  • దేశ రాజధాని ఢిల్లీలో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,900 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.664,240గా ఉంది.
  • దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58.750 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64.090గా ఉంది
  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,400 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,720గా ఉంది
  • బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,750ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,090గా ఉంది