గోల్డ్ షాపులు డిస్కౌంట్ల బాట

గోల్డ్ షాపులు డిస్కౌంట్ల బాట

కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రమోషన్లు
తనిష్క్ నుంచి కల్యాణ్ జ్యుయల్లర్స్ వరకు ఆఫర్లే ఆఫర్లు…

వెలుగు బిజినెస్‌‌డెస్క్ : ఫెస్టివల్ సీజన్‌‌లో కస్టమర్లను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు ఆఫర్లతో మురిపిస్తున్నాయి. సాధారణంగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉండే ఈ కాలంలో  ప్రమోషన్లతో జ్యుయల్లర్స్ కస్టమర్లను ఆకట్టుకోవాల్సి వస్తోంది. ధరలు ఎక్కువగా ఉండటంతో, కస్టమర్లను కోల్పోకుండా జ్యుయల్లర్స్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇండియాలో మోస్ట్ వాల్యుబుల్ జ్యుయల్లర్ తనిష్క్ నుంచి కల్యాణ్ జ్యుయల్లర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వరకు డిస్కౌంట్ల బాట పట్టాయి. అమ్మకాలను పెంచుకోవడానికి తనిష్క్ హై ఎండ్ జ్యుయల్లరీపై భారీ డిస్కౌంట్లు ఇస్తుండగా.. కల్యాణ్ జ్యుయల్లర్స్ బ్యాంక్‌‌లతో జతకట్టింది. ఈ నెల 27న దీపావళి, ఈ పండుగకు రెండు రోజుల ముందు ధన్‌‌తరేస్ ఉంది. గోల్డ్ కొనుగోళ్లకు ఇది ఎంతో పవిత్రమైన రోజు. దీంతో ధన్‌‌తరేస్, దీపావళి ఫెస్టివల్స్‌‌కు కొనుగోలుదారుల్ని ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు చూస్తున్నాయి.

ధరలు తగ్గకపోతే కొనుగోళ్లు వాయిదానే…

2019లో గోల్డ్ ధరలు డాలర్‌‌‌‌ టర్మ్స్‌‌లో ఆరేళ్ల గరిష్టాన్ని తాకాయి. ఓ వైపు ట్రేడ్ వార్,మరోవైపు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. వీటన్నింటికీ తోడు సెంట్రల్ బ్యాంక్‌‌లు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా చేపడుతుండటంతో గోల్డ్ ధరలకు రెక్కలొచ్చాయి. గత నెలలో అయితే గోల్డ్ ధర ఆల్‌‌ టైమ్ హై మార్క్‌‌ను తాకింది. మరోవైపు దీని దిగుమతులు కూడా తగ్గాయి. పండుగల కాలంలో బంగారం కొనడం, వేసుకోవడం గత కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, గోల్డ్ ధరలు తగ్గే వరకు తాము వేచిచూస్తామని, ఒకవేళ దీపావళి వరకు బంగారం ధరలు తగ్గకపోతే కొనుగోళ్లను వాయిదా వేస్తామని కొందరు చెబుతున్నారు. ముంబైలో బెంచ్‌‌మార్క్ గోల్డ్ ఫ్యూచర్స్‌‌ సెప్టెంబర్‌‌‌‌లో ఆల్‌‌టైమ్ హైలో 10 గ్రాములకు రూ.40 వేల మార్క్‌‌ను అందుకుంది. ఈ గరిష్ట స్థాయిల నుంచి 4 శాతం తగ్గినా.. గతేడాది దీపావళితో పోలిస్తే మాత్రం ధరలు 20 శాతం అత్యధికంగానే ఉన్నాయి.

అమ్మకాలు పెంచుకోవడానికి ప్రయత్నాలుదీపావళి ఈ ఏడాది క్యాలండర్‌‌లో కేవలం ఫెస్టివల్‌గానే ఉంది. జ్యుయల్లర్స్‌కు ఎలాంటి ఫెస్టివల్‌ ను అందించడం లేదు. మార్కెట్ చాలా బ్యాడ్‌గా ఉంది. కస్టమర్లు లేకపోవడంతోనే కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.-ఇండియా బుల్లియన్ అండ్ జ్యుయల్లర్స్ అసోసియేషన్ లిమిటెడ్‌ మాజీ జాయింట్ సెక్రటరీ, ముంబై జ్యుయల్లర్ కేతన్ శ్రోఫ్ తనిష్క్‌‌.

తనిష్క్ గోల్డ్,  డైమండ్ జ్యుయల్లరీ మేకింగ్​ ఛార్జీలను 25 శాతం తగ్గించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఛార్జీలు స్టోర్లకు స్టోర్లకు మధ్య చాలా తేడాలుంటాయి. ఆభరణం మొత్తం ధరలో ఇవే 10 శాతం వరకు ఉంటాయి. అదేవిధంగా సోషల్ మీడియా కాంపిటీషన్లు పెట్టి, దానిలో గెలుపొందిన వారికి జ్యుయల్లర్స్ ఇవ్వాలనుకుంటోంది.

కల్యాణ్ జ్యుయల్లర్స్

కల్యాణ్ జ్యుయల్లర్స్ కూడా డిస్కౌంట్లకు అదనంగా ప్రతి వారం డ్రా నిర్వహించాలని చూస్తోంది. ఈ డ్రా ద్వారా కస్టమర్లకు మూడు లక్షల గోల్డ్ కాయిన్లు ఇవ్వాలనుకుంటోంది. అంతేకాక జ్యుయల్లర్స్ తయారు చేసినందుకు తక్కువ ఛార్జీలను కూడా విధించనున్నట్టు ఛైర్మన్ టీఎస్ కల్యాణ్ రామన్ చెప్పారు. అదనపు డిస్కౌంట్ల కోసం కల్యాణ్ బ్యాంక్‌‌లతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్

రూ.15 వేలకు పైగా కొనుగోళ్లు చేసిన వారికి కంపెనీ గోల్డ్ కాయిన్లు ఇవ్వనుంది. కస్టమర్లు అడ్వాన్స్ ఆర్డర్లు కూడా చేపట్టవచ్చు. అయితే బుక్ చేసినప్పుడు ఉన్న ధర లేదా డెలివరీ సమయంలో ఉన్న ధరలో.. ఏది తక్కువగా ఉంటే ఆ ధరనే కస్టమర్లు చెల్లించుకునే ఆప్షన్‌ను అందిస్తోంది. ఎకానమిక్ స్లోడౌన్ కస్టమర్ల సెంటిమెంట్‌పై బాగా ప్రభావం చూపిందని, ముఖ్యంగా గోల్డ్ జువెల్లరీ డిమాండ్ తగ్గిందని ఛైర్మన్ అహ్మద్ ఎం.పీ బ్రైడ్స్ చెప్పారు. కానీ ఫెస్టివల్, వెడ్డింగ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ ట్రెండ్ నమోదయ్యేలా తాము చూస్తున్నామని చెప్పారు.

దీపావళి  తర్వాత వెడ్డింగ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. అప్పుడందరూ బంగారం కొనుగోళ్లు చేపడతారు. జ్యుయల్లర్స్‌కు అత్యధిక రెవెన్యూలు వెడ్డింగ్ సీజన్ కొనుగోళ్ల నుంచే వస్తాయి.