తూప్రాన్ లో 12 తులాల బంగారం చోరీ

తూప్రాన్ లో 12 తులాల బంగారం చోరీ

తూప్రాన్ ,వెలుగు: బస్సు ఎక్కుతుండగా మహిళ బ్యాగులో ఉన్న బంగారం చోరీకి గురైన సంఘటన మంగళవారం తూప్రాన్ లో జరిగింది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం..  హైదరాబాద్ కు చెందిన ఉప్పల శ్వేత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తూప్రాన్ లో జరిగే ఓ వివాహ వేడుకకు వచ్చింది. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు తూప్రాన్ బస్టాండ్ కు వచ్చింది. 

తూప్రాన్ లో బస్సు ఎక్కిన శ్వేత టోల్​గేట్​సమీపంలోకి  వెళ్లగానే తన బ్యాగును పరిశీలించింది. అందులో ఉన్న 12:50 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే బస్సు దిగి తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.