మీకేనా.. నాకూ ఉంది బంగారు పన్ను!

మీకేనా.. నాకూ ఉంది బంగారు పన్ను!

పెద్ద పెద్ద మీసాలతో గుర్రున గాండ్రిస్తున్న  ఈ పులి మొహం చూడండి.. తేడా కనిపించిందా!? పచ్చగా మెరిసిపోతూ బంగారు కోర పన్ను కంట పడిందా!? అదే ఈ బెంగాల్​ టైగర్​ స్పెషాలిటీ. మన పన్ను పాడైపోతే ఏం చేస్తం? పీకేసి కొత్త పన్ను కట్టించుకుంటం! ఖర్చు కొంచెం ఎక్కువైనా ఫర్వాలేదు కొంచెం గ్రాండ్​గా కనిపించాలనుకుంటే ఆ పెట్టిన పంటిని బంగారంతో చేయించుకుంటం! జర్మనీలోని ఓ జూలో ఉంటున్న కేరా అనే ఈ బెంగాల్​ టైగర్​కూ అధికారులు ఇలా గ్రాండ్​ లుక్​ ఇచ్చారు. ఈ మధ్య ఆడుతూ ఆడుతూ ఓ కొయ్య బొమ్మను కొరికేసిందట కేరా. దీంతో దాని కుడి కోర పన్ను విరిగిపోయిందట. అందుకే జూ అధికారులు జూ యానిమల్​ షెల్టర్​లోని డెంటిస్ట్​ దగ్గరకు ట్రీట్​మెంట్​ కోసం తీసుకెళ్లారు.

రెండు సిట్టింగ్​ల ట్రీట్​మెంట్​ చేశారు. ఆగస్టులో చేసిన మొదటి సిట్టింగ్​లో విరిగిన పన్నును షేప్​ చేయడానికే రెండున్నర గంటలు పట్టిందట. అక్టోబర్​ మొదటి వారంలో రెండో సిట్టింగ్​లో అరగంటలో దానికి ఆ బంగారు పన్నును పెట్టారట. ప్రత్యేకమైన గమ్​, అతినీలలోహిత కిరణాలతో అది చిగుళ్లకు అతుక్కునేలా ఫిక్స్​ చేశారట. నిజానికి 2013లో ఇటలీలోని ముగ్నానోలోని ఓ ప్రైవట్​ ఫార్మ్​ హౌస్​లో కేరా ఉండేదట. 2015లో అధికారులు కేరాను స్వాధీనం చేసుకుని జర్మనీలోని మాస్వైలర్​లోని టియరర్ట్​ టైగర్​ స్టేషన్​కు తరలించారు. ఇప్పుడు అది అక్కడే ఉంటోంది.