ఎయిర్​పోర్ట్​లో రూ.కోటి 10 లక్షల బంగారం స్వాధీనం

ఎయిర్​పోర్ట్​లో రూ.కోటి 10 లక్షల బంగారం స్వాధీనం

శంషాబాద్, వెలుగు: బంగారాన్ని బెల్టు రూపంలో మార్చి తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్​పోర్ట్​కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి గురువారం శంషాబాద్ ఎయిర్​పోర్ట్​కు చేరుకున్న విమానంలో కేరళకు చెందిన ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బంగారాన్ని బెల్టు రూపంలో మార్చి ప్యాంటుకు బెల్టు పెట్టుకునే ప్రాంతంలోపల కుట్లు వేసి గుట్టుగా తరలిస్తుండగా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 1761 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారు రూ. కోటి 10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.