స్వర్ణకవచధారి సీతారామయ్య

స్వర్ణకవచధారి సీతారామయ్య

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి శుక్రవారం భక్తులకు బంగారు కవచాల్లో దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు స్వర్ణ కవచాలతో అలంకరణ చేసి, బాలభోగం నివేదించి ప్రత్యేక హారతులను సమర్పించారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి భక్తులకు మంజీరాలను పంపిణీ చేశారు. లక్ష్మీ అష్టోత్తరశతనామ, కుంకుమార్చనలు జరిగాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. 

సీతారాముల కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం చేశారు. కంకణాలు ధరించి భక్తులు క్రతువులో పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవలో స్వామికి సంధ్యాహారతిని సమర్పించారు. పాల్వంచకు చెందిన బలస సరోజా అనే భక్తురాలు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ను విరాళంగా అందజేశారు.