భారత ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో గోల్డెన్ లెటర్ డే

భారత ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో గోల్డెన్ లెటర్ డే
  • యుద్ధ విమాన తొలి పైలెట్ గా కెప్టెన్ అభిలాష బరాక్
  • కంబాట్ ఏవియేటర్ గా చేరిన మొదటి మహిళగా రికార్డ్


దేశం గర్వించే విధంగా మొదటిసారిగా భారత సైన్యంలో యుద్ధ విమాన పైలెట్ గా కెప్టెన్ అభిలాష బరాక్ నిలిచారు. విజయవంతగా శిక్షణను పూర్తి చేసిన తర్వాత కంబాట్ ఏవియేటర్ గా చేరిన మొదటి మహిళగా రికార్డుకెక్కారు. నాసిక్ లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్, కల్నల్ కమాండెంట్ ఆర్మీ ఏవియేషన్ అధికారి అభిలాషకు వింగ్స్ బ్యాడ్జి ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో గోల్డెన్ లెటర్ డే అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. అంతకు ముందు ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో మహిళలు గ్రౌండ్ డ్యూటీలలో మాత్రమే ఉండేవారు. గత ఏడాది జూన్ లో తొలిసారిగా ఇద్దరు మహిళలు హెలికాప్టర్ పైలెట్ శిక్షణకు ఎంపికయ్యారు. 

ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో కంబాట్ ఏవియేటర్ శిక్షణ నిమిత్తం మొత్తం 15 మంది మహిళా అధికారులు ఆసక్తి కనబరిచారని.. అయితే పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్టుల్లో ఇద్దరు మాత్రమే ఎంపికయి..శిక్షణ పూర్తి చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. వీరిద్దరూ నాసిక్ లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ లో శిక్షణ పొందారు. ప్రస్తుతం ఆర్మీ విమానయాన విభాగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, గ్రౌండ్ డ్యూటీ బాధ్యతలను మహిళలకే అప్పగించారు. అయితే బరాక్.. ఇకపై పైలట్ బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. అందుకోసం నాసిక్ లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ లో శిక్షణ పొందుతారు.

 

 

మరిన్ని వార్తల కోసం...

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం

బోగస్..మోర్ బోగస్..మోస్ట్ బోగస్ అంటున్న కార్తీ చిదంబరం