అథ్లెటిక్స్ లో రెండు స్వర్ణాలతో బోణి కొట్టిన భారత్

అథ్లెటిక్స్ లో  రెండు స్వర్ణాలతో బోణి కొట్టిన భారత్

దోహా: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌లో ఇండియా పసిడి బోణీ కొట్టింది. తొలి రోజే నాలుగు పతకాలు సాధించిన ఇండియాకు రెండో రోజు గోమతి మరిముతు, తేజిందర్‌పాల్‌ సింగ్‌ రెండు స్వర్ణాలు అందించారు. శివ్‌ పాల్‌ సింగ్‌ రజతం, సరితా బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌ ,ఎమ్‌ .పి. జబీర్‌ కాంస్య పతకాలు గెలిచారు.సోమవారం జరిగిన మహిళల 800 మీటర్ల ఫైనల్లో గోమతి రెండు నిమిషాల 2.70 సెకండ్లతో పోడియం ఫినిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి బంగారు పతకం ఖాతాలో వేసుకుంది. పురుషుల షాట్‌ పుట్‌లో గుం డును 20.22 మీటర్ల దూరం విసిరిన తేజిందర్‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌ నెగ్గాడు. జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రోలో శివ్‌ పాల్‌ సింగ్‌ రతజం గెలిచాడు. ఫైనల్లో జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 86.23 మీటర్లు విసిరి వ్యక్తి గత బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు నమోదు చేసిన అతను రెండో స్థానం సాధించాడు. మహిళల 400 మీ. హర్డిల్స్‌ లో 57.22 సెకండ్లతో మూడోస్థానం సాధించిన సరితాబెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌ కాం స్యం గెలిచింది. మరో అథ్లెట్‌ ఎమ్‌ . అర్పిత 58.15 సె-కండ్లతో ఆరో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. పురుషుల 400 మీ. హర్డిల్స్‌ లో పర్సనల్‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమింగ్‌ 49.13 సెకండ్లతో ఎమ్‌ .పి. జబీర్‌ కాం స్యంపతకం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల 100మీ. రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ద్యుతీచంద్‌ నిరాశ పరిచింది.సెమీస్‌ ఫైనల్లో 11.26 సెకండ్లతో జాతీయ రికార్డును బద్దలు కొట్టిన ద్యుతీ ఫైనల్లో 11.44 సెకండ్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 400మీటర్లలో భారీ అంచనాలున్న అరోరికా రాజీవ్‌ ,మహ్మద్‌ అనాస్‌ నిరాశ పరిచారు. 45.37 సెకండ్లతో నాలుగో స్థానంలో నిలిచిన రాజీవ్‌ త్రుటిలో పతకం కోల్పోయాడు. అనాస్‌ 46.10 సెకండ్లతోఎనిమిదో ప్లేస్‌తో సంతృప్తి చెందాడు.