గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం సెకండ్ లుక్ రిలీజ్‌‌‌‌

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం సెకండ్ లుక్ రిలీజ్‌‌‌‌

కోలీవుడ్ స్టార్ అజిత్‌‌‌‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌‌‌‌కి హ్యూజ్ రెస్పాన్స్ రాగా, గురువారం సెకండ్ లుక్ రిలీజ్‌‌‌‌ చేశారు.  

బ్లాక్‌‌‌‌ కూలింగ్ గ్లాసెస్‌‌‌‌, చేతిపై డ్రాగన్ టాటూతో ఖైదీ గెటప్‌‌‌‌లో స్టైలిష్‌‌‌‌గా కనిపిస్తున్నాడు అజిత్.  మ్యాసివ్ గన్‌‌‌‌ ఫైరింగ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.