Good Health : డైటింగ్ లో ఎక్కువ తినకుండా ఇలా కంట్రోల్ చేసుకోవాలి

Good Health : డైటింగ్ లో ఎక్కువ తినకుండా ఇలా కంట్రోల్ చేసుకోవాలి

"డైటింగ్ మొదలుపెట్టా..కానీ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది" అంటుంటారు చాలామంది. " బరువు తగ్గాలంటే చాక్లెట్లు, జంక్ఫుడ్ తినొద్దని చెప్పింది డాక్టర్. కానీ, నాకవే ఎక్కువగా తినాలనిపిస్తుంది" అంటారు ఇంకొంతమంది. అదేంటో డైటింగ్ మొదలుపెట్టినప్పుడే జంక్ఫుడ్ రుచులు కోరుతుంది నాలుక. ఇక పుడీస్ గురించి అయితే చెప్పక్కర్లేదు. క్రే వింగ్స్ కంట్రోల్ చేసుకోలేరు. డైటింగ్ చేయకపోతే బరువు తగ్గరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే....

ఎక్కువ తినకుండా కంట్రోల్ ఇలా..

ప్రొటీన్ తక్కువ తీసుకోవడం వల్ల ఎనర్జీ తగ్గిపోయి.. ఎక్కువ ఆకలి వేస్తుంది. షుగర్, స్వీట్స్ లాంటివి ఎక్కువగా తినాలనిపిస్తుంది. అందుకే, ప్రొటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి. హైక్వాలిటీ హార్మోన్లను ఉత్పత్తి చేసి, బ్లడ్ షుగర్ ని బ్యాలెన్స్ చేయడంలో ప్రొటీన్ ఫుడ్ కీ రోల్ . త్వరగా ఆకలి వేయకుండా ఉండేందుకు పై బర్ ఫుడ్ తినాలి. గుడ్లు, చికెన్, పాలు, చేపలు పన్నీర్ లాంటివి తీసుకుంటే ఎక్కువ సేపు ఎనర్జీ ఉంటుంది. దాంతో పాటు మంచి ఫ్యాట్ కంటెంట్ ఉండే నెయ్యి, ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటలు తినాలి.

• 'తినాలి తినాలి' అనిపించే ఫీలింగ్ కంట్రోల్ చేసుకోవాలంటే చూయింగమ్ ఉపయోగపడుతుంది. దాన్ని నములుతూ నోటిని బిజీగా ఉంచితే తిండియావతగ్గుతుందట. • శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటే ఆకలి తక్కువ వేస్తుంది. అందుకే, ఎక్కువగా నీళ్లు తాగాలి. అన్నం తినేముందు నీళ్లు తాగితే తిండియావ తగ్గడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.

• స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, బాధ ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు కొంతమందికి ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ శాతం జంక్ఫుడ్నే సెలెక్ట్ చేసుకుంటారు. అంతేకాకుండా స్ట్రెస్ పెరగడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి, హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకే, స్ట్రెస్ గా అనిపించినప్పుడు వాకింగ్ చేయడం. సినిమా చూడటం, మ్యూజిక్ వినడం లాంటివి చేయాలి.

• డైటింగ్ పేరుతో కడుపు కాల్చుకోకూడదు. శరీరానికి అవసరమైనంత మొత్తంలో టైం తినాలి. లేకపోతే బరువు తగ్గకపోగా ఇంకా వెయిట్ పెరుగుతుంది.

• సరిగా నిద్ర పోకపోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు కూడా ఎక్కువగా తినాలనిపిస్తుంది. కాబట్టి కంటి నిండా, హాయిగా నిద్రపోవాలి.

• డైటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు? ఏం తినాలి? అనేది ప్లాన్ చేసుకోవాలి. దానివల్ల ఏదిపడితే అది తినకుండా, హెల్దీ ఫుడ్ మాత్రమే తినే అవకాశం ఉంటుంది.

న్యూట్రిషియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ తినాలనే ఆసక్తి తగ్గిపోతుంది.