Good Health : బాదం, అల్లం, బీన్స్ రోజూ తింటే.. ఆ ఎనర్జీనే వేరు..

Good Health : బాదం, అల్లం, బీన్స్ రోజూ తింటే.. ఆ ఎనర్జీనే వేరు..

ఐదు కోట్ల కార్డియో పేషెంట్స్ ప్రపంచంలోనే మన దేశానికి మొదటి ప్లేస్. ఒబెసిటీలో 15.5 కోట్ల పేషెంట్స్ రెండో స్థానం. 7.7 కోట్ల డయాబెటిక్, పది కోట్ల హైబీపీ పేషెంట్స్ ఉన్నారు ఇప్పటివరకు. ఫ్యూచర్ లో ఈ డిజిట్స్ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. అందులో ఒకరుగా ఉండకూడదంటే ఇప్పట్నించే జాగ్రత్తపడాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ హెల్దీ ఫుడ్ని డైట్ లో చేర్చాలి.

 Also Read: బీ రెడీ : 25 నుంచి హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ రైలు

డెట్, హెల్త్ .. ఇవి రెండూ ఒకదానితో మరొకటి ఇంట ఉంటాయి. డైట్ బాగుంటే ఆరోగ్యానికేం డోకా ఉండదు. కానీ, అందులో ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యానికే ఎసరు. మళ్లీ దాన్ని క్యూర్ చేసే కెపాసిటీ కూడా డైట్ కే ఉంటుంది. అందుకే హెల్దీగా ఉండాలంటే పక్కా ప్లాన్ చేసుకోవాలి. డైలీ డైట్ కచ్చితంగా ఈ ఐదు సూపర్ ఫుడ్స్ చేర్చాలి.

బాదం

ఇమ్యూనిటీ గట్టిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. అందుకే ఇమ్యూనిటీ పెంచే ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్తో నిండిన ఫుడ్ ఎక్కువగా తినాలి. ఇవన్నీ బాదంలో పుష్కలం. 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ స్టడీ' కూడా ఇదే చెబుతోంది. ఈ స్టడీ ప్రకారం వారంలో ఏడు సార్లు బాదం తింటే 20 శాతం సడెన్ డెత్ ల నుంచి తప్పించుకోవచ్చని తేలింది. దానికి కారణం వీటిల్లో ఉండే విటమిన్-ఇ.మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లెవిన్, జింక్. కండరాలని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి ఇవి. అలాగే టైప్ 2 డయాబెటిస్తో బాధపడేవాళ్లు ప్రతి రోజూ 23 నుంచి 30 గ్రాముల బాదం తింటే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే బాదం తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దాంతో తేలిగ్గా బరువు తగ్గొచ్చు. రోజంతా ఎనర్జిటిక్గా ఉంచే పవర్ కూడా ఉంది ఈ సూపర్ ఫుడ్ కి.

కమలా పండు

'యూనివర్సిటీ ఆఫ్ పిసా' చేసిన స్టడీలో ప్రతిరోజూ ఆరెంజ్ తింటే గుండెజబ్బుల నుంచి బయటపడొచ్చని తేలింది. వీటిల్లోని పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ సెల్స్ లో ర్యాడికల్ డ్యామేజీని తగ్గించి అందమైన, ఆరోగ్యమైన చర్మాన్ని ఇస్తాయి. ఆరెంజ్లోని విటమిన్ - సి తెల్ల రక్త కణాలు, యాంటీ బాడీస్ వృద్ధికి సాయపడుతుంది. బాడీలో ఇమ్యూనిటీ పెంచి ఇన్ఫెక్షన్లని దరిచేరనివ్వదు. స్ట్రెస్, యాంగ్జెటీని పెంచే 'కార్టిసాల్' అనే హార్మోన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది.

కీర దోస

కీర దోసలో 96 శాతం నీరే ఉంటుంది. దీనివల్ల డీ హైడ్రేషన్ దరిచేరదు. మెటబాలిజంకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. అతి తక్కువ కేలరీలున్న కీరదోసని రెగ్యులర్గా తింటే ఒబెసిటీ నుంచి బయటపడొచ్చు. ఇందులోని క్యాల్షియం, విటమిన్-కె ఎముకలకి బలాన్నిస్తాయి. విటమిన్ - ఎ, బి, సి, మాంగనీస్, కాపర్, పొటాషియం ఇమ్యూనిటీని బలపరుస్తాయి. కీరదోసలోని విటమిన్-బి1, బి5, బి7 యాంగ్జెటీ, స్ట్రెస్ అదుపుచేస్తాయి.

అల్లం

వంట రుచినే కాదు ఆరోగ్యాన్ని పెంచుతుంది అల్లం. ఈ సూపర్ ఇంగ్రెడియెంట్ ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తాయి. బాడీలో ఇమ్యూనిటీ పెంచి చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడేస్తాయి.

బీన్స్

ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, ఫైబర్తో నిండిన బీన్స్ ని రెగ్యులర్గా తింటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. బీన్స్లో ఉండే కరిగే ఫైబర్స్ బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ ని తగ్గిస్తాయి. వీటిల్లోని ఇతర ఫైబర్స్ ఆకలిని కంట్రోల్ చేసి బరువు తగ్గడానికి సాయపడతాయి. బీన్స్ లోని 'పాలీఫినాల్స్' ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుండె జబ్బుల్ని దరిచేరనివ్వవు.