ఆక్సిజన్​ పెరగాలంటే.. ప్రోనింగ్​ చేయండి

V6 Velugu Posted on May 04, 2021

 • బోర్లా పడుకుంటే 6 శాతం నుంచి 8 శాతం వరకు ఎక్కువ అవుతుందంటున్న నిపుణులు
 • లంగ్స్ లోకి వైరస్ వ్యాప్తి వేగంగా జరగదని వెల్లడి
 • ఒకసారి వచ్చిపోతే 6 నెలల దాకా మళ్లీ వైరస్ సోకదని కామెంట్
 • కరోనా నుంచి కోలుకున్న 3 నెలల తర్వాత టీకా తీసుకోవాలని సూచన

న్యూఢిల్లీ: కరోనా సెకండ్​వేవ్​ మొదలైనప్పటి నుంచి ఎందరిలోనో ఏవేవో అనుమానాలు మెదులుతున్నాయి. కరోనా సోకి తగ్గినోళ్లు వ్యాక్సిన్​ వేసుకోవచ్చా? ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లతో లాభమెంత? యువతకే ఎందుకు సీరియస్​ అవుతోంది? వంటి ప్రశ్నలు గిర్రున తిరుగుతున్నాయి. వాటన్నింటికీ కొందరు ప్రముఖ డాక్టర్లు సమాధానాలు చెప్పారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న డాక్టర్స్​ రౌండ్​ టేబుల్​లో వాటికి వివరణాత్మకంగా సమాధానం చెప్పారు. ఇవీ వారి సూచనలు.. 

 • లంగ్స్​కు కరోనా వైరస్​ వేగంగా వెళ్లట్లేదు. లంగ్స్​లోకి వైరస్​ పోవడానికి కొవిడ్​ న్యుమోనియానే కారణం కాదు. వైరస్​ సోకినప్పుడు ఒక్కోసారి ఇమ్యూన్​ సిస్టమ్​ అతిగా స్పందిస్తుంది. వైరస్​ను చంపడానికి పుట్టిన యాంటీబాడీలే.. లంగ్స్​నూ క్రాస్​ యాక్టివిటీలో దెబ్బతీస్తున్నాయి. వైరస్​ సోకిన 8వ రోజు నుంచి 14వ రోజు మధ్య ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైంలోనే స్టెరాయిడ్లు కీలకంగా మారుతున్నాయి. 
 • ఆక్సిజన్​ లెవెల్స్​ పడిపోయినట్టు అనిపిస్తే వెంటనే ప్రోనింగ్​ (బోర్లా పడుకోవడం) చేయాలి. దాని వల్ల ఆక్సిజన్​ లెవెల్స్​ 6 నుంచి 8 శాతం దాకా పెరుగుతాయి. కాన్సంట్రేటర్ల వల్ల లాభం ఉన్నా వాటి ద్వారా 5 లీటర్ల కన్నా ఎక్కువ ఆక్సిజన్​ను వాడుకోలేం. ఒకవేళ ఎక్కువ అవసరం అయితే మాత్రం ఆక్సిజన్​ సిలిండర్లను వాడాల్సిందే.
 • 50 ఏళ్లు దాటిన వారిలో పల్స్​రేట్​ 140 కన్నా ఎక్కువుంటే డేంజర్​. 
 • సీటీస్కాన్ ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు. ఆక్సిజన్​ 94 కన్నా పడిపోయినప్పుడు, ఇన్​ఫెక్షన్​ మార్కర్లు ఎక్కువైనప్పుడు, పేషెంట్​ పరిస్థితి సీరియస్​గా ఉన్నప్పుడు మాత్రమే సీటీస్కాన్​ చేయాలి. ఆర్టీపీసీఆర్​లో పాజిటివ్​ వస్తే సీటీస్కాన్​ అవసరం లేదు. వైరస్​ సోకిన 5 నుంచి 7 రోజుల మధ్య సీటీ చేయాలి. 
 • గాలి ద్వారా కూడా వైరస్​ సోకుతోంది. కాబట్టి వ్యాక్సినేషన్​ను వేగంగా చేపట్టాలి. లేట్​ అయ్యే కొద్దీ వ్యాక్సిన్లకూ లొంగకుండా వైరస్​ మొండిగా మారే ప్రమాదం ఉంది.  
 • పారాసిటమాల్​, మల్టీ విటమిన్లు, జింక్​ తప్ప మొదటి వారంలో ఎలాంటి మందులూ వాడనక్కర్లేదు. జ్వరం ఉన్నాలేకున్నా ప్రతి 6 గంటలకు ఒకసారి పారాసిటమాల్​ టాబ్లెట్​ వేస్కోవాలి. 
 • రెండో వారంలో పరిస్థితి విషమిస్తే మాత్రం డాక్టర్ల సలహా మేరకు స్టెరాయిడ్లతో ట్రీట్​మెంట్​ తీసుకోవాలి. లంగ్స్​ ఇన్​ఫెక్షన్స్​పై స్టెరాయిడ్స్​ ట్రీట్​మెంట్​ బాగా పనిచేస్తుంది.
 • డబ్ల్యూహెచ్​వో చెప్పినట్టు ఇప్పుడు ఎవరికీ ప్లాస్మా ట్రీట్​మెంట్​ అవసరం లేదు.
 • కరోనా వచ్చి తగ్గిపోయినోళ్లకు మళ్లీ 3 నుంచి 6 నెలల దాకా వైరస్​ సోకదు. 
 • కరోనా తగ్గిన 3 నెలల తర్వాతే టీకా వేస్కోవాలి.
 • వైరస్​ సోకిన కొన్ని రోజులపాటు యువతలో ఇమ్యూనిటీ ఉంటోంది. అయితే, సడన్​గా ఒకేసారి కొలాప్స్​ అవుతోంది. ఇన్​ఫెక్షన్​ పెరగడంతో పరిస్థితి సీరియస్​ అవుతోంది. కాబట్టి యువత కూడా ముందే జాగ్రత్త పడాలి.

Tagged good health, , increase oxygen levels, proning for oxygen, avoid corona, avoid breathing problems

Latest Videos

Subscribe Now

More News