ఐటిఐ విద్యార్థులకు శుభవార్త రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు

ఐటిఐ విద్యార్థులకు శుభవార్త  రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు

ఐటిఐ చేసిన వారికి ఇండియన్ రైల్వేస్ గుడ్‪న్యూస్ చెప్పింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ గా పనిచేయడానికి 550 ఖాళీలకు దరఖాస్తులు కోరుతుంది. పంజాబ్​ రాష్ట్రంలోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ 550 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 11 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.  అభ్యర్థులకు పదో తరగతిలో 50 శాతం మార్కులు ఉండాలి. సంబంధిన ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్​ సర్టిఫికెట్ పొంది ఉండాలి. 

ఫిట్టర్ - 200, వెల్డర్- 230, మెషినిస్ట్ - 5, పెయింటర్​- 20, కార్పెంటర్​ -5, ఎలక్ట్రీషియన్- 75, ఏసీ& రిఫ్రిజిరేషన్ మెకానిక్ -15 పోస్టులు ఉన్నాయి. 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు.. అయితే వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు కూడా వర్తిస్తుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. pardarsy.railnet.gov.in అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 9.