టీమిండియా క్రికెటర్లకు గుడ్‌‌న్యూస్‌

టీమిండియా  క్రికెటర్లకు గుడ్‌‌న్యూస్‌

న్యూఢిల్లీ: టీమిండియా  క్రికెటర్లకు గుడ్‌‌న్యూస్‌‌. దాదాపు ఐదేళ్ల తర్వాత సెంట్రల్‌‌ కాంట్రాక్ట్‌‌ ప్లేయర్లు బంపర్‌‌ హైక్‌‌ను అందుకోబోతున్నారు. 2022–23 సీజన్‌‌కు ఆటగాళ్ల జీతాలు 10 నుంచి 20 శాతం పెంచాలని బీసీసీఐ యోచిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ అంశంపై అపెక్స్‌‌ కౌన్సిల్‌‌లో తుది నిర్ణయం తీసుకోనుంది.

చివరిసారి 2017–18 సీజన్‌‌లో ప్లేయర్ల జీతాలు పెంచారు. వినోద్‌‌ రాయ్‌‌ నేతృత్వంలోని సీవోఏ.. ఏ+ గ్రేడ్‌‌ ప్లేయర్లకు రూ. 7 కోట్లు చెల్లించింది. ఇప్పుడు దానిని రూ. 10 కోట్లకు పెంచే చాన్స్‌‌ ఉంది. రూ. 5 కోట్ల స్లాబ్‌‌ను రూ. 7 కోట్లకు, గ్రేడ్‌‌–బి, సి..ప్లేయర్లకు రూ. 5 కోట్లు, 3 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇంగ్లండ్‌‌ ప్లేయర్లతో పోలిస్తే మనోళ్లకు వార్షిక వేతనం ఇంకా తక్కువగానే ఉండటంతో రోహిత్‌‌, కోహ్లీ, రాహుల్‌‌కు పెద్ద మొత్తంలో జీతాలు పెరిగే చాన్స్‌‌ ఉంది.