
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) దేశవ్యాప్తంగా "స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్" ను ప్రారంభించింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 17, 2025 వరకు ఈ ప్రచారాన్ని కొనసాగించనుంది. ప్రీమియం చెల్లించకపోవడంతో ఆగిపోయిన వ్యక్తిగత పాలసీలను ఈ క్యాంపెయిన్ ద్వారా తిరిగి చెల్లుబాటు అయ్యేలా చేసుకోవచ్చు.
ఈ ప్రచారంలో భాగంగా లేట్ ఫీజులో గరిష్టంగా రూ.5 వేల వరకు, అంటే 30శాతం వరకు రాయితీ ఇవ్వనున్నారు. పెద్ద పాలసీలకు ఇది వర్తిస్తుంది. చిన్న ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే లేట్ ఫీజు వసూలు చేయరు.
మొదటిసారిగా ప్రీమియం చెల్లించని తేదీ నుంచి ఐదేళ్లలోపు పాలసీ ఉంటే స్పెషల్ రివైవల్ క్యాపెంయిన్ ద్వారా తిరిగి చెల్లుబాటు చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లించే కాలంలో పాలసీ ఉండాలి. మెచ్యూర్ కాకూడదు. సాధారణ వైద్య పరీక్షలు తప్పనిసరి.